Somu Veerraju: అమరావతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని.. ఇది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కోరుకుంటుందని స్పష్టం చేశారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విశాఖపట్నమే పరిపాలన రాజధాని అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన కామెంట్లపై స్పందించారు.. అమరావతి కేంద్రంగా రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు కేంద్రం ఇచ్చింది.. అలాగే, నాలుగువేల కోట్లు అప్పు కూడా ఇప్పించాం అన్నారు.. ఇక, అనంతపురం నుంచి విజయవాడకు హైవే నిర్మాణం కోసం పూనుకున్నాం.. కానీ, మూడు రాజధానులు అభివృద్ధికి దోహదం కాదని స్పష్టం చేశారు.. అమరావతి రాజధానిగా ఉండాలి.. విశాఖను అభివృద్ధి చేయాలి.. ఇదే మా అభిప్రాయం అన్నారు సోము వీర్రాజు.. ఆసియాకి విశాఖ స్ట్రాటజికల్ పాయింట్. ఇక్కడ పోర్టు నుంచే అనేక ప్రాంతాలకు రవాణా సాగుతోందని తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు.. రాబోయే రోజుల్లో విశాఖపట్నం రాజధాని కాబోతుంది.. త్వరలో నేను కూడా విశాఖపట్నం షిఫ్ట్ అవుతున్నాను అంటూ ఢిల్లీ వేదికగా జరిగిన దౌత్య వేత్తల సమావేశంలో స్పష్టం చేశారు.. విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నా అంటూ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించిన విషయం విదితమే.
Read Also: Payyavula Keshav: విశాఖ రాజధాని.. సీఎం ప్రకటన వెనుక అనేక కారణాలు..