జగనన్న చేదోడు పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 3,25,020 మంది అర్హులైన రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్లకు రూ.325.02 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు.. జగనన్న చేదుడో పథకం కింది రాష్ట్ర వ్యాప్తంగా 3.25 లక్షల మంది లబ్ధిదారులకు రూ.10 వేల చొప్పున ఆర్ధిక చేయూత అందిస్తోన్న విషయం విదితమే.
విజయవాడలోని ఏపీ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్టీ అధ్యక్షురాలు దగ్గబాటి ఫురంధేశ్వర తీరుకు నిరసనగా ఓ మహిళా నాయకురాలు ఆత్మహత్యయత్నం చేసింది.
టీడీనీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడి సతిమణీ నారా భువనేశ్వరిని పార్టీ కార్యక్రమాల్లో యాక్టివేట్ చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. నిజం గెలవాలి పేరుతో వచ్చే వారం నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఆమె పర్యటించనున్నారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 26 వ తేదీ నుంచి వైసీపీ సామాజిక న్యాయ యాత్ర బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది అని వైసీపీ జోనల్ ఇంచార్జ్, జిల్లా ఇంచార్జ్ మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. సమ సమాజ స్దాపన కోసం సీఎం జగన్ కృషిచేస్తున్నారు..
జాతీయ వైద్య మండలి కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోందని, వాటిని సడలించి పాత పద్ధతి కొనసాగించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయను కలిసి విజ్ఞప్తి చేశారు.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను టీడీపీ నేతల బృందం కలిసింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు అరెస్ట్ అంశంతో పాటు రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను గవర్నరుకు తెలుగు తమ్ముళ్లు వివరించారు.
సీఎం జగన్ మాట్లాడుతూ.. డ్రై రేషన్ పంపిణీ పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి అని తెలిపారు. ఇప్పుడు అమలవుతున్న విధానంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి.. రేషణ్ నాణ్యత విషయంలో ఎక్కడా లోపాలు ఉండకూడదు అని అధికారులకు సీఎం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకలీ ఓట్లను తొలగించాలని వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో మంత్రులు సమావేశం అయ్యారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఓట్ల జాబితాలో అవకతవకలపై కంప్లైంట్ చేశారు.
భుత్వ పదవులు ఇప్పిస్తానంటూ కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిందితుడు విశ్వతేజగా పోలీసులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ బంగారపు షాపు యజమాని దగ్గర, రాజ్యసభ సీటు ఇప్పిస్తానని చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలోని బీసీ మనసుల్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుస్థిర స్థానం సంపాదించుకున్నారు అంటూ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. రాష్ట్రాలు కుల గణన చేసుకోవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.. అందులో భాగంగానే ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం అని ఆయన పేర్కొన్నారు.