రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉండటంతో రైతులకు సంబంధించి అనేక చర్యలను ప్రభుత్వం తీసుకుంటోంది అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఖరీఫ్ సీజన్ లో ఈసారి సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో రైతులకు అండగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ఇప్పటికే ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాము.. శాస్త్రవేత్తలు చర్చించి ఏఏ పంటలు వేయాలనే విషయంపై అవగాహన కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సాధారణ వర్ష పాఠం..574.7 మిల్లీ మీటర్లు ఉండగా 487.2 15 మిల్లీ మీటర్లు నమోదైంది.. 15 శాతం వర్షం తగ్గింది.. ప్రత్యామ్నాయ పంటల కోసం.. రైతులకు సబ్సిడీతో విత్తనాలను సరఫరా చేస్తున్నామని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
Read Also: NBK 110 : బాలయ్య 110వ సినిమాను అనౌన్స్ చేశారా? పోస్టర్ ఇదేనా?
అంతేగాక పంటల బీమా పథకాన్ని కూడా అమలు చేస్తున్నామని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తోంది.. పంట నష్టపోయిన రైతులకు బీమా సొమ్ము కూడా చెల్లిస్తున్నాం.. ప్రభుత్వ విధివిధానాల ప్రకారమే. 103 మండలాలను కరువు మండలాలను ప్రకటించారు.. అక్కడ ఇన్ పుట్ సబ్సిడీ తో పాటూ అవసరమైన ఇతర చర్యలను చేపట్టాం.. రబీకి సంబంధించి కూడా పరిస్థితిని సమీక్షించామన్నారు. రెండో విడత రైతు భరోసా నిధులను ఈనెల 7న పుట్టపర్తిలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ రైతులకు అందిస్తారు అని చెప్పారు. వాస్తవాలను తెలుసుకోకుండా పచ్చ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది అని మంత్రి కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Jose Butler: ఈ వరల్డ్ కప్లో పేలవ ప్రదర్శన.. ఇంగ్లాండ్ కెప్టెన్ తీవ్ర ఆవేదన..!
ఇప్పుడు టీడీపీ నేతలు కరువు ప్రాంతాలు చూస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ హయాంలో కరువు విలయతాండవం చేస్తే రైతులకు ఏమి చేశారు అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు స్టీరింగ్ కమిటీ పేరుతో ఏ ముఖం పెట్టుకొని రైతుల వద్దకు వస్తారు.. టీడీపీ హయాంలో రైతు రథం.. నీరు చెట్టు పేరుతో దోచుకున్నారు.. వ్యవసాయంపై కనీస పరిజ్ఞానం లేని లోకేష్ కూడా లేఖలు రాయడం ప్రారంభించారు.. ఎన్నికలు వస్తున్నాయని ఏదో ఒకటి చేస్తున్నారు.. ఈ ప్రభుత్వ హయాంలో ఏమి చేశారో చెప్పండి.. రైతులకు జగన్ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నారు.. రాష్ట్రంలో కరువు రావాలని పచ్చ మీడియా కోరుకుంటోంది.. పచ్చ పేపర్లు టీడీపీ కరపత్రాలుగా మారాయి.. గతంలో రైతుల ఇబ్బంది పడినప్పుడు ఈ పత్రికలు ఏం చేశాయి.. రైతులకు అండగా నిలవాలని లక్ష్యంతోనే ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.