విజయవాడలో 15 అడుగుల వైఎస్ఆర్ విగ్రహ ఆవిష్కరణను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ రుహుల్లా పాల్గొన్నారు. వన్ టౌన్ స్వాతి రోడ్డులో వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇక, స్వాతి రోడ్డు మీద భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు భారీ సంఖ్యలో విజయవాడ వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Also: Amala Paul: రెండో భర్తను పరిచయం చేసిన స్టార్ హీరోయిన్.. ఇది ఎన్నాళ్లు అంటున్న అభిమానులు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పశ్చిమ నియోజకవర్గంలో ఖైదీ నం.7691 సందు సందుల్లో కార్పొరేటర్ ఎలక్షన్లలో తిరిగారు.. చంద్రబాబు 24 గంటలు ఇక్కడ తిరిగితే.. పెద్దిరెడ్డి 4 గంటలు మాత్రమే తిరిగి కార్పొరేటర్లను గెలిపించారు అని ఆయన విమర్శించారు. చంద్రబాబు సీఎం, ఎంపీ నాని, పారిపోయిన జలీల్ ఖాన్, దద్దమ్మ దేవినేని ఉమ ఉండి కూడా వన్ ఔన్ అభివృద్ధి కాలేదు అంటూ వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ ఆహ్వానించదగినది.. అభివృద్ధి చేసిన సీఎం జగన్ ను గుర్తు పెట్టుకోవాలి అని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దేవినేని అవినాష్, వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్.. పశ్చిమ నియోజకచర్గానికి శాశ్వత ఎమ్మెల్యేగా వెలంపల్లి ఉంటారు అని ఆయన తెలిపారు.
Read Also: Thammineni Seetharam: సీఎంగా జగన్ మళ్లీ వస్తేనే భవిష్యత్ ఉంటుంది..
వైఎస్ఆర్ ఒక గొప్ప దార్శనికుడు అని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ అన్నారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలు ఎవరూ ప్రవేశపెట్టలేదు.. ఫీజు రీఇంబర్సుమెంట్ ద్వారా ఎందరో లబ్ధి పొందుతున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతీ పేదవాడికి వైద్యం అందడానికి కారణం వైఎస్ఆర్ పెట్టిన ఆరోగ్యశ్రీ.. ప్రతీ రైతుకు నీరు అందాలని జలయజ్ఞం చేపట్టారు.. సీఎం జగన్ మరో అడుగు ముందుకేసి సంక్షేమ పథకాలు ప్రవేళ పెట్టారు అని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చెప్పుకొచ్చారు.