ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ.. చంద్రబాబు కుటుంబం పై హాట్ కామెంట్ చేశారు. దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ నుంచి వచ్చి చంద్రబాబుకు ఆయన కొడుకు కోవర్టుగా పనిచేయడానికి వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు.
బీసీ కుల గణనతో సమూల మార్పులు వస్తాయని ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు అన్నారు. కుల గణన వల్ల అన్ని వర్గాలకూ లబ్ధి చేకూరుతుంది.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కుల గుణన చేపట్టాలి.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీసీ కులాల గణనను చేపట్టాలి అని ఆయన డిమాండ్ చేశారు.
ఎవరైనా దళితుడిగా పుట్టాలి అపుకుంటారా అని చంద్రబాబు అన్నప్పుడు టీడీపీ దళితుల ఏమైపోయారు?.. జగన్ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా చేసిన సంక్షేమంపై చర్చకు టీడీపీ రాగలుగుతుందా? అని మంత్రి మేరుగ నాగార్జున సవాల్ విసిరారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వారాహి యాత్ర 5వ దశ నిర్వహణ, జనసేన - తెలుగుదేశం సమన్వయ కమిటీల ఉమ్మడి సమావేశ నిర్వహణ అంశాలపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సుదీర్ఘంగా చర్చించారు.
ఏపీ సచివాలయంలో ఆక్వా సాధికారిత కమిటీ సమావేశం అయింది. ఆక్వా పరిశ్రమలో ఒడిదొడుకులను నివారించేందుకు సాధికారిత కమిటీని జగన్ సర్కార్ నియమించింది. ఈ కమిటీలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజుల ఉన్నారు.
జగనన్న భూహక్కు-భూరక్ష పథకంపై ఏర్పాటు చేసిన ఏపీ కేబినెట్ సబ్ కమిటీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ రావుతో పాటు ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ్ కల్లాం అధ్యక్షతన భేటీ అయింది. పథకం అమలుపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో మంత్రుల సబ్ కమిటీ సమీక్షించింది.
కర్నూలు జిల్లాలో ఎల్లుండి ( ఈనెల 19వ తేదీన ) రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు మండలంలో జగనన్న చేదోడు పథకం నాలుగవ విడతకు సంబంధించి నగదు జమ చేయనున కార్యక్రమానికి వెళ్తున్నారు.
సోమవారం నుంచి శనివారం వరకు రోజుకి రెండు లీగల్ ములఖాత్లు ఇస్తూ వచ్చారు జైలు అధికారులు.. ఇప్పుడు తీసుకున్న తాజా నిర్ణయంతో.. చంద్రబాబు లీగల్ ములాఖత్ల సంఖ్య ఒకటికి పడిపోయింది..
నన్ను మా బిడ్డల్లాంటి కార్యకర్తలు కలవకూడదా..? చంద్రబాబుకు మద్దతుగా రాజమండ్రిలో ఉన్న నన్ను మా బిడ్డల్లాంటి కార్యకర్తలు కలవకూడదా..? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. నాకు మనోధైర్యం కలిగించేలా టీడీపీ శ్రేణులు సంఘీభావ యాత్ర చేపడితే తప్పేముంది..? అని నిలదీశారు.. బాధలో ఉన్న అమ్మను కలుస్తామంటే చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులివ్వడమేంటీ..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, మద్దతుదారులు నన్ను కలవకూడదని చెప్పే హక్కు ఈ…