ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీయే గెలిచేది.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డే మళ్ళీ సీఎం అవుతారని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ తెలిపారు. జిల్లాలో పార్లమెంట్ గానీ.. అసెంబ్లీ గానీ ఆయన ఎవరు అభ్యర్ధి అంటే వారినే మనం కలిసి కట్టుగా పని చేసి గెలిపించాలి అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అందరం కలిసి కట్టుగా వైసీపీ పార్టీని గెలిపించుకోవాలి అని ధర్మాన కృష్ణ దాస్ పిలుపునిచ్చారు.
Read Also: Mumbai: మ్యాట్రిమోనియల్ సైట్‌లో పరిచయం.. మహిళపై పలుమార్లు అత్యాచారం…
రాష్ట్రంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డినే అని ధర్మాన కృష్ణ దాస్ చెప్పుకొచ్చారు. విద్య, వైద్యం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి.. ఆయన ఏ అంశాన్ని నిర్లక్ష్యం చేయలేదు అని మాజీ డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ తరువాత వచ్చిన ప్రభుత్వాలు జిల్లాలో అభివృద్ధినీ నిర్లక్ష్యం చేశాయి.. కానీ, మళ్లీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చాక ఇప్పుడు అభివృద్ధి ఊపందకుంటున్నాయని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ వెల్లడించారు.
Read Also: Mahesh Babu: బీడీ లేకుండా బాబు కనిపించడం కష్టమేమో..
శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి ప్రాంతంలో 4500 కోట్ల రూపాయలతో మూలపేట పోర్ట్ వస్తుంది అని ధర్మాన కృష్ణ దాస్ తెలిపారు.
ఉద్దానం ప్రాంతానికి ఆఫ్ సోర్ రిజర్వాయర్.. కిడ్నీ వ్యాధి గ్రస్తులకు 700 కోట్ల రూపాయలతో రక్షిత మంచి నీరు పథకం, రెండు వందల పడకల హాస్పిటల్ తీసుకు వస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ చెప్పారు.