గత కొన్ని రోజులుగా వైసీపీ-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భగా ఎంపీ విజయ సాయిరెడ్డి పురంధేశ్వరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బహునేర్పరి పురంధేశ్వరి అని ఆయన విమర్శించారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ ఇంకోవైపు టీడీపీకి అనధికార గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగడం అనైతికం అని మండిపడ్డారు.
Read Also: Israel-Hamas War: గాజాపై అణుదాడి, ఇజ్రాయిల్ మంత్రి వ్యాఖ్యలు.. స్పందించిన పీఎం నెతన్యాహు
తండ్రిని కాంగ్రెస్ పార్టీ అవమాన పరిచిందని.. ఆ అవమానాల పునాదులపైనే ఏర్పాటైన టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీతో అంటకాగి చంద్రబాబు గెంటేసే సరికి అదే తండ్రిని అవమానించిన కాంగ్రెస్ పార్టీలో చేరి నిస్సిగ్గుగా కేంద్ర మంత్రి పదవులు అనుభవించిన నీతిలేని చరిత్ర పురంధరేశ్వరిది అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానవీయంగా విభజన చేసిన కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా తనవంతు శకుని పాత్ర పోషించి రాష్ట్రాన్ని నాశనం చేసిన మహా గొప్ప మహిళ ఈ పురంధరేశ్వరి అని ఎంపీ విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.