విశాఖపట్నంలోని భీమిలిలో వైసీపీ సామాజిక సాధికారిక బస్సు యాత్రలో భాగంగా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో అధికారం కొంత మంది చేతుల్లోనే ఉందన్న ప్రతిపక్షాల విమర్శలు అర్థ రహితం అంటూ ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లూ వేసుకున్న ముసుగులు తీసి వేసి చేస్తున్నది అనైతిక రాజకీయం కాదా? అంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో మా కుటుంబం ప్రమేయం లేదు.. టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు ఒక పైసా కూడా అవినీతి చేయలేదని స్పష్టం చేశారు నారా లోకేష్.. ఇక, చంద్రబాబుకు ప్రాణహాని ఉంది. వైసీపీ నేతల ఈ విషయం చెబుతున్నారు.. చంద్రబాబు జైల్లోనే చచ్చిపోతారని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు
ఆంధ్రప్రదేశ్లో రైతుల పరిస్థితి దుర్భరంగా ఉంది.. సీఎం వైఎస్ జగన్ వెంటనే కరువు మండలాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్ వదిలి రైతుల కష్టాలపై దృష్టి సారించాలన్న ఆయన.. సీఎం జగన్ పొలం బాట పడితే రైతుల కష్టాలు తెలుస్తాయి అన్నారు
ఏలూరులో వాలంటీర్ వ్యవహారం సంచలనంగా మారింది.. మహిళను లోబర్చుకొని వాలంటీర్ గర్భవతిని చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ గ్రామానికి చెందిన ఓ మహిళను లోబర్చుకున్న గర్భవతిని చేశాడు వాలంటీర్ మండిగ సత్య గణేష్.. అయితే, విషయం బయటకొస్తుందని నెల క్రితమే ఆ వాలంటీర్ను విధుల నుంచి తొలగించారు.