ఒక పని చేస్తే చంద్రబాబుకు బెయిల్ వచ్చే అవకాశం ఉందన్నారు మంత్రి అంబటి రాంబాబు.. విదేశాలకు పంపించిన తన మాజీ పీఏ శ్రీనివాస్ ను వెనక్కి పిలిపించాలని.. శ్రీనివాస్ వెనక్కి వస్తే.. చంద్రబాబుకు వెంటనే బెయిల్ లభించే అవకాశం ఉందన్నారు.
గత ఏడాది కూడా ఒక సామాజిక వర్గ సమావేశంలో ఇలా అనుచిత వ్యాఖ్యలు చేశారు.. నన్ను భౌతికంగా లేకుండా చేస్తే 50 లక్షల బహుమానం ఇస్తామని అప్పుడు ప్రకటించారు, ఇవాళ భౌతికంగా నా పై దాడి చేయటానికే వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి అంబటి రాంబాబు
ఈ రోజు ప్రకాశం జిల్లాలోని తన నియోజకవర్గం మార్కాపురంలో తర్లపాడు మండలం చెన్నారెడ్డి పల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు వైసీపీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి.. తమ గ్రామ పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు.. ఇక ఊర్లో తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూ.. అందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు.