Religious conversions: తిరుమలతో పాటు.. టీటీడీకి చెందిన ఏ ఆలయం అయినా.. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఆలయాలు అయినా.. అక్కడ ఉండే పుష్కరిణిలను చాలా పవిత్రంగా చూస్తారు భక్తులు.. అలాంటి టీటీడీ పుష్కరిణినే మత మార్పిడికి అడ్డాగా మార్చుకున్నారు.. ఇది గమనించిన స్థానికులు.. వారితో వాగ్వాదానికి దిగిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది..
Read Also: Kotha Manohar Reddy: బీఎస్సీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి ఎన్నికల ప్రచార షెడ్యూల్
చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కార్వేటినగరం మండలంలో టీటీడీ స్కంద పుష్కరిణిలో అపచారం జరిగింది.. కార్వేటి నగరం మండలం టీటీడీ అనుబంధ వేణుగోపాలస్వామి ఆలయ స్కంద పుష్కరిలో మతమార్పిడికి తెరలేపారు.. హిందువుల పవిత్రంగా పూజించే స్నానమాచరించి స్కంద పుష్కరణిలో క్రైస్తవ మత మార్పిడికి బాప్తిజం చేశారు.. ఇది గమనించిన స్థానికులు కొందరు అక్కడికి చేరకుని క్రైస్తవులతో వాగ్వాదానికి దిగారు.. హిందువులను బలవంతంగా క్రైస్తవ మతంలోకి మత మార్పిడి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు.. అక్కడి బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. బలవంతంగా మత మార్పిడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, దేశవ్యాప్తంగా మతమార్పిడులపై హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.