నేటి నుంచి ఏపీలో కుల గణన ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణన ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది.. రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా కులగణన ప్రారంభించనున్నారు.. మొదట 3 గ్రామ సచివాలయాలు, 2 వార్డు సచివాలయాల పరిధిలో కులగణన ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు.. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో కుల గణన జరగనుంది.. రెండు రోజుల పాటు ప్రయోగాత్మకంగా కులగణన చేపట్టనున్నారు.. ఇక, కుల గణనపై ఈ నెల 22 తేదీ వరకు శిక్షణ నిర్వహించనున్నారు.. ఇవాళ్టి నుంచి జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించబోతున్నారు.. ఐదు పట్టణాల్లో ప్రాంతీయ సదస్సులు జరగనున్నాయి.. ఈ నెల 17న రాజమండ్రి, కర్నూలులో ప్రాంతీయ సభలు నిర్వహించనుండగా.. ఈ నెల 20న విజయవాడ, విశాఖపట్నంలో, 24న తిరుపతిలో ప్రాంతీయ సదస్సులు జరగనున్నాయి.. కాగా, కుల గణన జరగాలంటూ పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.. ముఖ్యంగా బీసీ కుల గణన జరగాలంటున్నారు.. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నాయి.. ఇదే సమయం కొన్ని రాష్ట్రాలు కుల గణనకు పూనుకోగా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది.
ఘనంగా కోటి దీపోత్సవం.. రెండోరోజు కార్యక్రమాలు ఇవే..
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా కోటిదీపోత్సవ యజ్ఞం ఘనంగా ప్రారంభమైంది.. తొలి రోజు ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగాయి.. శ్రీశైలం మల్లన్న కల్యాణాన్ని చూసి తరించారు భక్తులు.. తొలి రోజే పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో.. కోటిదీపోతవ్సం వేదిక జనసంద్రంగా మారిపోయింది.. ఇక, రెండో రోజు కోటిదీపోత్సవంలో నిర్వహించే విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నారు..
భక్తి టీవీ కోటిదీపోత్సవం వేదికగా రెండో రోజు జరిగే విశేష కార్యక్రమాలు..
* శివతనయుల వైభవం
* భక్తులచే కాజీపేట శ్వేతార్కమహాగణపతికి కోటిగరికార్చన
* ఒకే వేదికగా కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి, మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం
* మూషిక వాహనంపై లంబోధరుడు, మయూర వాహనంపై సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం
* హోస్పెట చింతామణి మఠం శ్రీనివానంద భారతిస్వామి అనుగ్రహభాషణం
* హైదరాబాద్ ఆర్షవిద్యా గురుకులం శ్రీపర్వవిదానందసరస్వతిస్వామి అనుగ్రహభాషణం
* బ్రహ్మకుమారీస్ జర్మనీ రాజయోగిని సుధేశ్ దీదీజీ అనుగ్రహభాషణం
* శ్రీకాకునూరి సూర్యనారాయణమూర్తి ప్రవచనామృతం
* కోటిదీపాల వెలుగులు, సప్తహారతుల కాంతులు, లింగోద్భవ వైభవం, మహాదేవునికి మహానీరాజనం, అద్భుత సాంస్కృతిక కదంబం.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం కానున్న దీపయజ్ఞం కోటి దీపోత్సవానికి అందరూ ఆహ్వానితులే.. భక్తులకు సాదరంగా ఆహ్వానం పలుకుతోంది రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్..
నేడు నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు
నేడు తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియకు చివరి రోజు. దీంతో ఈ నెల 30వ తేదీన ఎన్నికల పోలింగ్ బరిలో నిలిచేదెవరో ఇవాళ ఖరారు కానుంది. ఇక, నామపత్రాల పరిశీలన అనంతరం 2898 మంది అభ్యర్థులు మిగిలినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. కాగా, ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు ఛాన్స్ ఉంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మిగిలిన అభ్యర్థలకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయించననున్నారు. గుర్తింపు పొందిన పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీలు, స్వతంత్రులకు వరుస క్రమంలో జాబితా తయారు చేయనున్నారు. వాటి ఆధారంగా బ్యాలెట్ రూపొందించి ఈ నెల 30న పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే, మొత్తం నామినేషన్లు 3,504 వచ్చాయి. 2,898 నామినేషన్లకు ఎన్నికల అధికారులు ఆమోదం తెలిపారు. 606 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అత్యధికంగా గజ్వేల్‌లో 114 నామినేషన్లు నమోదు అయ్యాయి. మేడ్చల్‌లో 67 మంది, కామారెడ్డిలో 58 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. కొడంగల్‌లో 15 మంది బరిలో నిలిచారు. ఇక, నారాయణపేటలో అతి తక్కువగా ఏడుగురు అభ్యర్థులు మాత్రమే అసెంబ్లీ ఎన్నికల పోటీ చేస్తున్నారు. నామినేషన్ల పరిశీలన, స్క్రూటీనిలో ఆర్వోలు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని సీఈఓ కార్యాలయానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 119 నియోజకవర్గాల్లో రెబెల్స్ ను బుజ్జగించే పనిలో ప్రధాన పార్టీలు ఉన్నాయి.
రైతులకు గుడ్ న్యూస్.. నేడే ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు..
కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు మోడీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు పెట్టుబడి సాయం కోసం కేంద్రం అందిస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు నేడు బ్యాంకు ఖాతాల్లో జమ కాబోతున్నాయి. 15వ విడత కింద అర్హులైన దాదాపు 8 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లో దాదాపు 2000 రూపాయల చొప్పున జమ చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఝార్ఖండ్ లోని కుంటిలో ఇవాళ (బుధవారం) ఉదయం 11:30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నిధులు విడుదల చేస్తారని పేర్కొనింది. ఇక, ఎవరైతే ఈ-కేవైసీ పూర్తి చేశారో వారి ఖాతాల్లో కిసాన్ సమ్మాన్ నిధులు జమ కానున్నాయి. దేశవ్యాప్తంగా రైతులకు లబ్ధి జరిగేలా మోడీ సర్కార్ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరిట ఈ పథకాన్ని అమలు చేస్తోంది. సంవత్సరానికి మూడు దఫాలుగా 6000 రూపాయలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది. ఒక్కో విడతలో అర్హులైన రైతుల ఖాతాల్లోకి 2000 రూపాయల చొప్పున జమ చేస్తున్నారు. కేంద్ర సర్కార్ ఇప్పటి వరకు ఈ పథకం కింద 14 విడతలుగా నిధులను రిలీజ్ చేసింది. మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయా? లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ https://pmkisan.gov.in/ సైట్ లో చూసుకోవొచ్చు.
ఒబెరాయ్ హోటల్ అధినేత పీఆర్ఎస్ ఒబెరాయ్ కన్నుమూత
భారతదేశ హోటల్ పరిశ్రమ ముఖచిత్రాన్ని మార్చిన ఒబెరాయ్ గ్రూప్ అధినేత పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్(94) మంగళవారం ఉదయం కన్నుమూశారు. పిఆర్ఎస్ ఒబెరాయ్ 2022లో EIH లిమిటెడ్ కు చెందిన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, EIH అసోసియేటెడ్ హోటల్స్ లిమిటెడ్ ఛైర్మన్‌గా తన పదవులను విడిచిపెట్టాడు. పీఆర్‌ఎస్ ఒబెరాయ్ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4 గంటలకు భగవంతి ఒబెరాయ్ ఛారిటబుల్ ట్రస్ట్, ఒబెరాయ్ ఫామ్, కపషేరాలో నిర్వహించనున్నారు. ఒబెరాయ్ హోటల్స్, కార్పొరేట్ ఆఫీసులో PRS కోసం ప్రార్థనలు నిర్వహించబడతాయి. అతను భారత్, యునైటెడ్ కింగ్‌డమ్ (UK) , స్విట్జర్లాండ్‌లో చదువుకున్నాడు. ముఖ్యమైన నగరాల్లో అనేక లగ్జరీ హోటళ్లను ప్రారంభించడం ద్వారా అంతర్జాతీయ లగ్జరీ ప్రయాణికుల కోసం ఒబెరాయ్ హోటల్‌లను మ్యాప్‌లో ఉంచిన ఘనత ఒబెరాయ్‌కు ఉంది. 2008లో అతను దేశానికి చేసిన అసాధారణ సేవకు భారత రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌ను అందుకున్నాడు. PRS ఒబెరాయ్ ఒబెరాయ్ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ అయిన EIH లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా పనిచేశారు. PRS ఒబెరాయ్ నాయకత్వంలో ఒబెరాయ్ గ్రూప్ అపూర్వమైన విజయాన్ని సాధించింది. గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. లగ్జరీ, నాణ్యత, శ్రేష్ఠత కోసం కొత్త ప్రమాణాలను ఏర్పాటు చేసింది. ఒబెరాయ్ గ్రూప్‌లోని ప్రతి సభ్యునికి నిజాయితీ, నిజమైన సంరక్షణ ఆధారంగా కార్పొరేట్ సంస్కృతిని పెంపొందించాడు.
సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్ కన్నుమూత..
సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్(75) గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నారు.. ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్సను తీసుకుంటున్నారు.. సమస్య ఎక్కువ కావడంతో వైద్యానికి సహకరించలేదు.. దాంతో ఆయన తుది శ్వాస విడిచారు.. ఈయన 1948లో బీహార్‌లోని అరారియాలో ఆయన జన్మించారు, సహారా ఇండియా పరివార్‌ను ప్రారంభించిన సుబ్రతా రాయ్ విజయగాథ 1978లో ప్రారంభమైంది. కేవలం రూ. 2,000 తో వ్యాపారాన్ని ప్రారంభించి,సహారా ఇండియా వ్యాపరం 2000లో గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆ సయమంలో ఒక రిపోర్టులో భారతీయ రైల్వే తర్వాత దేశంలో రెండవ అతిపెద్ద ఉపాధి సంస్థగా అభివర్ణించారు. ఈయన మెటాస్టాటిక్ ప్రాణాంతకత, రక్తపోటు, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలతో సుదీర్ఘ పోరాటంలో కార్డియోస్పిరేటరీ అరెస్ట్‌తో సుబ్రతా రాయ్ మరణించారని సహారా బుధవారం ప్రకటనలో పేర్కొంది. ఆదివారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. ఇక అప్పటి నుంచి చికిత్స ను పొందుతూన్నారు.. ఆరోగ్యం విష మించడంతో తుది శ్వాస విడిచారు..
జో బైడెన్ తో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
డ్రాగన్ కంట్రీ అధినేత జిన్ పింగ్ అగ్ర రాజ్యం అమెరికాకి వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఆయన కీలక చర్చలు జరిపేందుకు అక్కడికి చేరుకున్నారు. అయితే, జిన్‌పింగ్‌కు అమెరికా మంత్రులు, ఉన్నతాధికారులు సైనిక లాంఛనాలతో గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ఇక, అమెరికా- చైనా దేశాల మధ్య సంబంధాలు పతనం అవుతున్న వేళ జిన్‌పింగ్ అమెరికా పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక, శాన్‌ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సుకు జో బైడెన్ ఆహ్వానం మేరకు జిన్‌పింగ్ వెళ్లారు. ఈ సమావేశం తర్వాత కాలిఫోర్నియాలో అమెరికా అధినేత జో బైడెన్- చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వై పాక్షిక సంబంధాలు, వాణిజ్యం, తైవాన్ అంశాలతో పాటు రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వివాదాలపై ఈ ఇద్దరు చర్చించనున్నట్లు తెలుస్తుంది. అయితే, ఇవే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న వాతావరణ మార్పులు, మాదక ద్రవ్యాల రవాణాను ఎదుర్కోవడం, మానవ హక్కుల ఉల్లంఘనలు, దక్షిణ చైనా సముద్రంలో అలజడులపై కూడా ఈ సమావేశంలో బైడెన్- జిన్‌పింగ్ చర్చలు జరపనున్నట్లు టాక్. ఇక, ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం, ఉక్రెయిన్- రష్యా మధ్య దాడులపై కూడా ఇరువురు దేశాధినేతల భేటీలో చర్చకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతానికి.. అపోహలను తొలగించుకునేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని అమెరికా- చైనా దేశాలు భావిస్తున్నాయి.
షుగర్ పేషంట్స్ పరగడుపున ఖాళీ పొట్టతో తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..!
రాత్రికి ఉదయానికి చాలా సమయం ఉంటుంది.. అందుకే ఉదయం అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం.. రోజంతా శరీరం ఉత్తేజంగా ఉండి, ఉత్సహంగా పని చేయాలంటే పరగడుపున తినే ఆహారం బ్రేక్ ఫాస్ట్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.. ఇక షుగర్ పేషంట్స్ బ్రేక్ ఫాస్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి.. కడుపునిండా తినడమే కాకుండా..రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో నెమ్మదిగా విడుదల చేసే ఆహారాలను ఎంపిక చేసుకోవాలి. మీరు తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ వల్ల షుగర్ స్థాయిలను అధికంగా చేసే ఫుడ్ ను తింటే రోజంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మధుమేహం ఉన్నవారిలో ఉదయానే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మన కాలేయం అదనపు గ్లూకోజ్‌ని ఉత్పత్తి చేస్తుంది… అందుకే జాగ్రత్తగా ఆహారాన్ని తీసుకోవాలి.. షుగర్ ఉన్నవారు ఖాళీ కడుపుతో ఒక స్పూను ఆవు నెయ్యిలో చిటికెడు పసుపు కలుపుకునే తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఆ రోజంతా మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా కాపాడుతుంది. అలాగే తీపి పదార్థాలు తినాలన్న కోరికలను కూడా నియంత్రిస్తుంది. నెయ్యి పొట్ట నిండిన భావనను పెంచుతుంది. పసుపు శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.. అలాగే మన వంటగదిలో ఉండే ఎన్నో మసాలా దినుసులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి..
భారత్, న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్.. హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో జోరు మీదున్న భారత్ కీలక పోరుకు సిద్దమైంది. బుధవారం వాంఖడే మైదానంలో న్యూజిలాండ్‌తో జరగనున్న సెమీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలో 9 మ్యాచ్‌లకు 9 గెలిచి ఓటమెరుగని జట్టుగా సెమీస్ చేరిన టీమిండియా.. అదే జోరులో కివీస్‌ను ఓడించి ఫైనల్‌కు చేరాలనుకుంటోంది. 2019 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాభావానికి ప్రతీకారం కూడా తీర్చుకోవాలనుకుంటోంది. మరోవైపు భారత్‌ను ఓడించి అందని ద్రాక్షగా ఉన్న వన్డే ప్రపంచకప్‌కు మరింత చేరువ కావాలని న్యూజిలాండ్ భావిస్తోంది. భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌కు వేదిక అయిన వాంఖడే మైదానం బ్యాటింగ్‌కు అనుకూలం. నేడు జరుగబోయే సెమీస్ మ్యాచ్‌లోనూ పరుగుల వరద పారడం ఖాయం. వాంఖడే స్టేడియం చిన్నది కావడంతో బ్యాటర్లు సునాయాసంగా సిక్సర్లు, ఫోర్లు బాదగలరు. ఇదే పిచ్‌పై శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 357 పరుగులు చేసింది. ఆపై శ్రీలంకను 55 పరుగులకే ఆలౌట్ చేసి.. 302 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఇక్కడ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం కష్టమవుతోంది. సాధారణంగా వాంఖడేలో స్పిన్నర్ల ప్రభావం ఎక్కువ. అయితే ఈ ప్రపంచకప్‌లో పేసర్లు విజృంభిస్తున్నారు. దాంతో ఈ మ్యాచ్‌లో టాస్ అత్యంత కీలకపాత్ర పోషించనుంది.
భారత్ vs న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్.. జ్యోతిష్యులు ఏం చెబుతున్నారంటే?
ఐసీసీ క్రికెట్ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. భారత్, న్యూజిలాండ్ వరుసగా రెండోసారి వన్డే ప్రపంచకప్‌లో తలపడనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ప్రపంచకప్‌లో టీమిండియాను కివీస్ ఓడించడంతో ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ సేన చూస్తోంది. అయితే అదంతా ఈజీ కాదు. 2003 నుంచి మెగా టోర్నీలలో న్యూజిలాండ్ ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది. ఈసారి భారత్ వరుస విజయాలు సాధించడంతో మ్యాచ్ ఎవరు గెలుస్తారని అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌పై ప్రముఖ జ్యోతిష్యుడు సుమిత్ బజాజ్ స్పందించారు. భారత్ vs న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్‌లో ఏ జట్టు విజేతగా నిలుస్తుంది, వాంఖడేలో ఏ టీమ్ మొదట బ్యాటింగ్ చేస్తుంది, మ్యాచ్‌లో ఏ ఆటగాళ్లు టాప్ పెర్ఫార్మర్స్‌గా నిలుస్తారని ప్రముఖ జ్యోతిష్యుడు సుమిత్ బజాజ్ అంచనా వేశారు. ముంబైలో భారత్ సెమీ ఫైనల్ ఆడుతుందన్న తన అంచనా నిజమైందని, ఇక అహ్మదాబాద్‌లో రోహిత్ సేన ఫైనల్ ఆడుతుందని బజాజ్ తెలిపారు. బుధవారం జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ముందుగా బౌలింగ్ చేస్తుందని వెల్లడించాడు.
ఈ ఖాన్స్ లేకుండా బాలీవుడ్ లేదు…
ఖాన్ త్రయం… ఈ మాట వింటే చాలు దాదాపు మూడు దశాబ్దాల పాటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమని ఏలిన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ గుర్తొస్తారు. ఒకరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్, ఇంకొకరు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్, మరొకరి బిగ్గెస్ట్ యాక్షన్ హీరో… ఈ ముగ్గురూ కలిసి హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీని ముందుకి నడిపించారు. 2018 మిడ్ నుంచి ఈ ముగ్గురు హీరోలు ఫ్లాప్స్ ఇవ్వడం, బాలీవుడ్ కష్టాలు మొదలవ్వడం ఒకేసారి జరిగింది. 2019 నుంచి షారుఖ్, ఆమిర్, సల్మాన్ నుంచి సరైన సినిమా లేకపోవడంతో హిందీ చిత్ర పరిశ్రమ పూర్తిగా దెబ్బతింది. దీనికి తోడు బాయ్కాట్ బాలీవుడ్, సుశాంత్ సూసైడ్ ఇష్యూ, నేపోటిజం బాలీవుడ్ ని పూర్తిగా కుదిపేశాయి. ఇదే సమయంలో సౌత్ నుంచి పాన్ ఇండియా సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ పై విరుచుపడ్డాయి. దీంతో హిందీ సినిమాలకి కష్టాలు ఎక్కువైపోయాయి. ఈ కష్టాలకి ఎండ్ కార్డ్ వేస్తూ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు రాబట్టి థియేటర్ మార్కెట్స్ ని రివైవ్ చేసాడు. ఇదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తూ జవాన్ సినిమాతో ఏకంగా 1200 కోట్లు రాబట్టాడు. ఈ రెండు సినిమాలు షారుఖ్ నే కాదు బాలీవుడ్ ని కూడా బ్రతికించాయి. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా టైగర్ 3 సినిమాతో రెండు రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ రాబట్టి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ బుకింగ్స్ రాబడుతున్నాడు. ఇక ఖాన్ త్రయంలో మిగిలింది ఆమిర్ ఖాన్ మాత్రమే… ఆమిర్ హిట్ కొడితే అది వెయ్యి, పదిహేను వందల దగ్గర ఆగదు… ఏకంగా ఇండస్ట్రీ హిట్ అవుతుంది. ఆమిర్ ఫ్యాన్స్ హిట్ కోసం అంత డెస్పరేట్ గా ఉన్నారు. సో ఆమిర్ కూడా హిట్ కొట్టేస్తే ఖాన్ త్రయం మరో పదేళ్ల పాటు బాలీవుడ్ ని రూల్ చేయడం పక్కా… అందుకే అంటారు నెవర్ రైట్ ఆఫ్ ఖాన్స్ అని.
ఎన్ని ట్రిప్పులు వేసాం అని కాదన్నయ్యా… సినిమా చెప్పిన టైమ్ కి రిలీజ్ చేస్తున్నామా లేదా?
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ ట్రిప్స్ ఎక్కువగా వేస్తున్నాడు, సినిమా షూటింగ్ డిలే అవుతుంది అంటూ ఎప్పుడులేనన్ని కామెంట్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. SSMB 28 ప్రాజెక్ట్ ని త్రివిక్రమ్ తో అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ కామెంట్స్ మరీ ఎక్కువగా స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత SSMB 28 కాస్త గుంటూరు కారం సినిమా అయ్యింది, జనవరి 12న రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేసుకుంది. ఈ రిలీజ్ డేట్ లాక్ అయిన తర్వాత మహేష్ బాబు ఫ్యామిలీతో ఎప్పుడు ఫారిన్ ట్రిప్ వెళ్లినా… సోషల్ మీడియాలో షూటింగ్ ఆగిపోయింది అంటూ రచ్చ మొదలయ్యేది. ఒకానొక సమయంలో అసలు మహేష్ గుంటూరు కారం సినిమా ఆపేస్తాడేమో అనుకునే వరకూ వెళ్లారు సినీ అభిమానులు. ఇది చాలదన్నట్లు పూజా హెగ్డే గుంటూరు కారం నుంచి తప్పుకోవడం, సాంగ్ లీక్ అవ్వడం, ఆర్ట్ డైరెక్టర్ ఛేంజ్ అవ్వడం… ఇలా బయటకి వచ్చిన ప్రతి వార్త గుంటూరు కారం సినిమాని ఇరకాటంలోనే పడేశాయి. అయితే ఎవరు ఏమనుకున్నా తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు మహేష్ బాబు అండ్ త్రివిక్రమ్. జనవరి 12 రిలీజ్ డేట్ టార్గెట్ మిస్ చేయకుండా జెట్ స్పీడ్ లో సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఇంకో వారం టాకీ పార్ట్ మాత్రమే పెండింగ్ ఉంది, ఆ తర్వాత సాంగ్స్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సో పక్కా ప్లానింగ్ తో త్రివిక్రమ్ అనుకున్న టైమ్ కి గుంటూరు కారం సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసి, రిలీజ్ డేట్ ని సినిమాని మహేష్ ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాడు.