ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి సర్వం సిద్ధమైంది.. అమ్మవారిని దర్శించుకు నేందుకు భక్తులు పోటెత్తారు.. అయితే, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.
ఏపీ ట్రాఫిక్ ఈ చలాన్ స్కామ్‌పై కేసు నమోదు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. ట్రాఫిక్ చలాన్ల వసూళ్ల ద్వారా వచ్చిన నిధులను అవినాష్ అనే వ్యక్తి దారిమళ్లించినట్టు అభియోగాలు మోపారు.. అవినాష్ కి చెందిన ఇవాల్వ్ సంస్థతోపాటు పలువురుపై కేసు నమోదు చేశారు.. 36 కోట్ల రూపాయలకు పైగా నిధులను దారి మళ్లించారని అవినాష్ పై ఆరోపణలు ఉన్నాయి.
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం కార్తీక మాసోత్సవాలకు సిద్ధం అవుతోంది.. శ్రీశైలంలో నవంబర్ 14వ తేదీ నుండి డిసెంబర్ 12వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నారు.. కార్తీకమాసం నిర్వహణ, భక్తుల ఏర్పాట్లపై ఈవో పెద్దిరాజు అధికార, అర్చకులతో సోమవారం రోజు సన్నాహక సమావేశం నిర్వహించారు.
విజయనగరం రైలు ఘటన పరిస్థితులు ప్రత్యక్షంగా చూసిన తర్వాత స్పందిస్తూ మరో ట్వీట్ చేశారు సీఎం జగన్.. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉన్నత స్థాయి ఆడిట్ కమిటీ వేయాలని ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే మంత్రికి అభ్యర్థించారు సీఎం జగన్.. 'నిన్న రాత్రి విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం నన్ను చాలా బాధించింది.. రన్నింగ్‌లో ఉన్న రైలు మరో రైలును ఢీ కొట్టింది, రెండూ ఒకే దిశలో నడుస్తున్నాయి.. ఈ భయంకరమైన ప్రమాదం కొన్ని…
టీడీపీ అంతర్గతంగా దివాళా తీసింది.. అందుకే రైల్వే క్షతగాత్రుల పరామర్శకు భువనేశ్వరి వెళ్తున్నారని విమర్శించారు. ఆమె టీడీపీ అధ్యక్షురాలు కానున్నారా? లోకేష్ ఏమయ్యాడు? ఎందుకు దూరం పెడుతున్నారు? అంటూ అనుమానం వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.