YSRCP Samajika Sadhikara Bus Yatra: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జరిగిన అభివృద్ధిని వివరిస్తూ.. గతంలో ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ.. వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించిన విషయం విదితమే.. ఇప్పటికే తొలి దశ బస్సు యాత్ర విజయవంతం చేసిన మంత్రులు, వైసీపీ నేతలు.. రెండో దశ యాత్రకు సిద్ధం అవుతున్నారు.. ఇవాళ్టి నుంచి వైసీపీ సామాజిక సాధికార యాత్ర ఫేజ్ -2 ప్రారంభం కానుంది.. ఇవాళ్టి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు రెండో ఫేజ్ బస్సు యాత్ర కొనసాగనుంది.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులతో ఈ బస్సు యాత్రలు సాగనున్నాయి.. తొలి దశలో మూడు ప్రాంతాల్లో అంటే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో ఒకేసారి బస్సు యాత్రలు నిర్వహించినట్టుగానే.. ఇవాళ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, గుంటూరు జిల్లా పొన్నూరు, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గాల్లో యాత్ర ప్రారంభంకానుంది.. 39 నియోజకవర్గాలలో రెండో విడత బస్సు యాత్ర సాగనుంది.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సాధికారతను ప్రజలకు వివరించటమే లక్ష్యంగా యాత్ర నిర్వహిస్తున్నారు.. మొదటి విడతలో 35 నియోజకవర్గాలను టచ్ చేసింది వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర.
Read Also: Stock Market Opening: రాకెట్ వేగంతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. 500 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ఈ యాత్ర ద్వారా వైఎస్ జగన్ పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరిగిన మేలును, సామాజిక న్యాయం, రాజ్యాధికారం పొందిన వైనాన్ని ప్రజలకు వివరిస్తున్నారు మంత్రులు, ప్రజాప్రతినిధులు, వైసీపీ నేతలు.. వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ యాత్ర తొలి దశలో 35 నియోజకవర్గాల్లో జరిగింది. రెండో దశలో 39 నియోజకవర్గాల్లో జరుగుతుంది. ఈ యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు పాల్గొంటారు. ఏపీ సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఈ వర్గాల ఆర్ధిక సాధికారత కోసం తీసుకున్న చర్యలను, చేసిన మంచిని ఈ యాత్రల్లో వివరించనున్నారు నేతలు.. అక్టోబర్ 26న ప్రారంభమైన సామాజిక సాధికార బస్సు యాత్ర మొదటి దశ విజయవంతం.. కాగా, ఇప్పుడు రెండో దశను మరింత ఉత్సాహంగా నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు వైసీపీ నేతలు.