కాకినాడ రూరల్ టీడీపీ కో ఆర్డినేటర్ పిల్లి సత్తిబాబు పదవికి రాజీనామా చేశారు. కారణాలను వివరిస్తూ... పార్టీ అధిష్టానానికి సుదీర్ఘ లేఖ రాశారాయన. అదంతా ఒక ఎత్తయితే... ఈ పరిణామాల గురించి మాత్రం తెగ గుసగుసలాడేసుకుంటోంది లోకల్ టీడీపీ కేడర్. ఏ ప్రయోజనాలు ఆశించి పిల్లి ఈ స్టంట్స్ చేస్తున్నారన్నది కేడర్ క్వశ్చన్. అధికార పార్టీలో కో ఆర్డినేటర్ పదవి అంటే... ఒక స్థాయి, స్థానం ఉంటుంది. అలాంటి పోస్ట్‌ను కూడా పిల్లి దంపతులు ఎందుకు వివాదాస్పదం…
ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి చేసిన విశ్లేషణ చర్చనీయాంశంగా మారింది. వివిధ సామాజికవర్గాల వారీగా వైసీపీకి పడ్డ ఓట్లు....కూటమి పార్టీలకు లభించిన మద్దతు గురించి ఓపెన్ డిస్కషన్ పెట్టారాయన. విశాఖలో జరిగిన వైసీపీ SC విభాగం ప్రాంతీయ సమావేశంలో ఆసక్తికరమైన లెక్కలు చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ నా SC, నా ఎస్.టి., నా బీసీ., నా మైనారిటీ అని ఎంతగా చెప్పినా.... పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చేసరికి అవేమీ పెద్దగా వర్కౌట్ కాలేదన్నది అమర్నాథ్ వాదన.…
యూరియా కొనుగోళ్లపై ఆంక్షలు పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. యూరియాను తక్షణ పంట అవసరాలకు మాత్రమే కొనుగోలు చేయాలి.. వ్యవసాయేతర పరిశ్రమల అవసరాలకు యూరియా వినియోగిస్తే కేసులు నమోదు చేయాలంటూ ఆదేశాలిచ్చారు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు..
సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇస్తున్నారు...ప్రస్తుతం ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా మంత్రులకు ర్యాంకింగ్స్ ఇచ్చారు.. భవిష్యత్తులో పెర్ఫార్మన్స్ ప్రకారం ర్యాంకులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు సీఎం చంద్రబాబు. మంత్రుల పనితీరు మెరుగు పర్చుకోవాలనే ఉద్దేశం తో ర్యాంక్ లు ఇస్తున్నారా.. లేకపోతే.. మంత్రులు కొన్ని అంశాల్లో వెనక బడ్డారని చెప్పడానికి ర్యాంక్ లు ఇస్తున్నారా..?
టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు రేపు పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తూన్నారు....75 మందిని ఈ సమావేశానికి ఆహ్వానించినట్టు సమాచారం.. తాజా పరిణామాలు ఎమ్మెల్యేల పై వరస వివాదాల నేపథ్యంలో చంద్రబాబు ఈ సమావేశం లో ఏం చెప్తారు. ఎమ్మెల్యేలకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారా..
నైపుణ్యం పోర్టల్ ను దేశానికే రోల్ మోడల్ గా నిలిచేలా తీర్చిదిద్దాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో నైపుణ్య విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి నారా లోకేష్.. ఈ సందర్భంగా నైపుణ్యం పోర్టల్ ను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న చర్యలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు నుంచి ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉంది.. ఎన్డీఏ అభ్యర్థికే మా మామద్దతు ఉంటుందని స్పష్టం చేశారు చంద్రబాబు.. తెలుగు వ్యక్తి అన్నప్పుడు గెలిచే అవకాశాలు ఉంటేనే అభ్యర్థిని పెట్టాలని సలహా ఇచ్చారు.. గెలిచే అవకాశం లేకపోయినా అభ్యర్థిని పెట్టి “ఇండియా” కూటమి రాజకీయం చేస్తుందని దుయ్యబట్టారు.. అసలు మేం ఎన్డీఏలో ఉన్నప్పుడు ప్రతిపక్ష (ఇండియా కూటమి) అభ్యర్థికి ఎలా మద్దతు ఇస్తాం..? అని ప్రశ్నించారు..
సిట్ విచారణలో సంచలనం విషయాలు బయటపెట్టారట నారాయణస్వామి.. ఏపీ బేవరేజ్ సంబంధించిన అధికారులను నియమించడంలో నా పాత్ర ఏమీ లేదన్నారు.. నాకు లిక్కర్ కేసుకు సంబంధం లేదన్న ఆయన.. సిట్ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు.. నా మాట అక్కడ వినే వారు ఎవరంటూ చెప్పుకొచ్చారట నారాయణస్వామి.. నా మాటలను అక్కడ ఏ అధికారి వినలేదన్న ఆయన.. సిట్ అధికారులు సేకరించిన ఆధారాలను ముందుపెట్టి ప్రశ్నించడంతో నీళ్లు నమిలారట.. నారాయణస్వామి నుంచి మరిన్ని కీలకమైన విషయాలు రాబట్టిందట…