గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇప్పుడు అడకత్తెరలో ఇరుక్కున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే మంత్రిగా ఆమె మెడ మీద కత్తి వేలాడుతోందన్న అభిప్రాయం బలపడుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో అయితే... దీనికి సంబంధించిన చర్చలు జోరుగా జరుగుతున్నాయి. సాలూరు నియోజకవర్గం నుంచి పోరాడి పోరాడి ఏదోలా ఎమ్మెల్యే అయిపోయిన గుమ్మడి..
ఎన్డీఏ తరఫున ఉప రాష్ట్రపతి బీజేపీ సీపీ రాధకృష్ణన్ ఉప రాష్ట్రపతి అభ్యర్దిగా బరిలో నిలవటంతో మద్దతుగా నిలిచింది వైసీపీ.. మొత్తంమీద మరోసారి తమకు బీజేపీతో స్నేహ సంభందాన్ని గుర్తుకు తెచ్చినట్లేనని ఆ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ధర్మవరం కాల్ మనీ కేసులో కీలక నిందితుడు రాజాను పోలీసులు అరెస్ట్ చేశారు.. ఇటీవల ఓ చేనేత కుటుంబంపై రాజా అండ్ గ్యాంగ్ డాడికి పాల్పడింది. తాజాగా ప్రధాన నిందితుడు రాజా ను అరెస్ట్ చేసి... రాజా వద్ద కోటి రూపాయల విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకుంది.. అలాగే అధిక వడ్డీలకు ఇచ్చిన రెండు ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.. గతంలోనే రౌడీ షీట్, మర్డర్, కాల్ మనీ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కొంతమంది మంత్రులు.. ఎమ్మెల్యేల పనితీరు పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు..క్యాబినెట్ సమావేశంలో క్లాస్.తీసుకున్నారు... ఎమ్మెల్యేల పనితీరు మరకపోతే కఠిన చర్యలు ఉంటాయన్నారు. మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు సీఎం చంద్రబాబు... ఫైళ్ల క్లియరెన్స్ కు సంబంధించి మంత్రులు. అధికారులు... వెంటనే దృష్టి పెట్టాలన్నారు సీఎం చంద్రబాబు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్.. అయితే, జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలో ఎమ్మెల్యేను తీవ్రంగా మందలించారు సీఎం.. ఈ విషయం అయినా.. పరిణితితో వ్యవహరించాలని హెచ్చరించారు.. ఇలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా. నియోజకవర్గంలోనూ అందరినీ సమన్వయం చేసుకుని వెళ్లాలని హితవు చెప్పారు సీఎం చంద్రబాబు..
కేబినెట్ భేటీకి ముందు మంత్రులతో ప్రత్యేకంగా కొన్ని అంశాలను ప్రస్తావించారు మంత్రి నారా లోకేష్.. మంత్రివర్గ భేటీకి ముందు ఎమ్మెల్యేల వివాదస్పద ఘటనలపై మంత్రులతో చర్చించారు.. ముఖ్యంగా దగ్గుబాటి ప్రసాద్, కూన రవి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నజీర్ అహ్మద్ అంశాలను ప్రస్తావించారట.. మరోవైపు, రౌడీషీటర్ శ్రీకాంత్‌కు పెరోల్ సిఫార్సు చేసిన కోటంరెడ్డి, సునీల్ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయట.. అనంతపురం, శ్రీశైలం ఎమ్మెల్యేలు సహా ఏడుగురి తీరు సరికాదని హితవు చెప్పారట లోకేష్.. టీడీపీ అధినేత,…
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. మొత్తం 33 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.. జలవనరులశాఖ పనులకు సంబంధించి మరో 11 అంశాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రివర్గం..