YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. అసలు, సొల్యూషన్ ఈవీఎంలది కాదు అన్నారు.. సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్ వస్తే న్యాయబద్ధంగా ఎన్నిక జరుగుతుందన్నారు.. పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర భద్రతా బలగల పర్యవేక్షణ ఉంటుందన్నారు.. అప్పుడు ఎలాంటి మెకానిజం తీసుకువచ్చిన ఇబ్బంది లేదు అన్నారు.. అయితే, పేపర్ బ్యాలెట్ అయితే మరీ మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వైఎస్ జగన్.. ఇప్పుడు పేపర్ బ్యాలెట్ అయినా ఈవీఎంలైనా చంద్రబాబు నేతృత్వంలోని పోలీసులు ముందు నిర్వహిస్తే ఒకే రకంగా ఉంటుందని వ్యాఖ్యానించారు వైఎస్ జగన్..
Read Also: Bigg Boss 9 : బిగ్ బాస్-9 లో మరో లవ్ ట్రాక్.. ఏం జరుగుతోంది..?
ఇక, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో మొత్తం 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి అని గుర్తు చేశారు. అయితే, చంద్రబాబు మూడుసార్లు సీఎంగా పని చేసినా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా కట్టలేదు అని ఎద్దేవా చేశారు. మేం అధికారంలోకి వచ్చాక 17 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తీసుకొచ్చాం.. ఒక్కో మెడికల్ కాలేజీ రూ.500 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేశాం.. కానీ, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడమంటే అవినీతికి పరాకాష్ట అని వైఎస్ జగన్ అన్నారు. మరోవైపు, పులివెందుల మెడికల్ కాలేజీకి NMC 50 సీట్లు అనుమతులు ఇస్తే చంద్రబాబు వద్దని వెనక్కి పంపారు అని వైసీపీ చీఫ్ జగన్ పేర్కొన్నారు. ఇంతకీ చంద్రబాబు మనీషా రాక్షసుడా మీరే ఆలోచించాలని తెలిపారు. మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తే, రాష్ట్ర ప్రజలకే మేలు జరుగుతుంది అన్నారు. మా ప్రణాళిక అమలు జరిగి ఉంటే, ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పిడుగురాళ్ల కాలేజీలు గతేడాదే అందుబాటులోకి వచ్చేవి.. ఈ ఏడాది మరో 6 మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చే వాళ్లమని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రులు లేకుండా ప్రైవేట్ దోపిడీని ఆపేది ఎవరు అని ప్రశ్నించారు. గవర్నమెంట్ ఆస్పత్రులను నడపడం అంటే ఒక బాధ్యత.. ఇక, మెడికల్ కాలేజీలు ప్రారంభమైతే, నాకు క్రెడిట్ వస్తుందని రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయడం ఎంత వరకు కరెక్ట్ అని వైఎస్ జగన్ క్వశ్చన్ చేశారు.