CM Chandrababu: సూపర్ సిక్స్-సూపర్ హిట్ విజయోత్సవ సభ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.. దసరా రోజున ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర అందిస్తాం అన్నారు.. ఆటో ఉన్న ప్రతి వ్యక్తికి 15 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తాం అంటూ శుభవార్త చెప్పారు.. ఈ దసరా నుంచి పథకం అమలు అవుతుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదు.. ప్రజల జీవన ప్రమాణం పెరగాలన్నారు.. దసరా రోజున వాహన మిత్ర పథకం ప్రారంభించి.. ఒక్కో ఆటో డ్రైవర్‌కు రూ.15వేలు చొప్పున ఇస్తామని చంద్రబాబు తెలిపారు.
Read Also: Asia Cup 2025: యూఏఈతో భారత్ మ్యాచ్.. బుమ్రాను ఆడిస్తే స్ట్రైక్ చేస్తా!
ఇక, సూపర్ 6 హామీలు నెరవేర్చి మాట నిలబెట్టుకున్నాం.. జవాబుదారీతనం, బాధ్యత కలిగిన ప్రభుత్వం మాది.. ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం అన్నారు సీఎం చంద్రబాబు.. 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కూటమికి 95శాతానికి పైగా స్ట్రైక్ రేట్ ఇచ్చి చరిత్ర తిరగరాశారు. తెలుగు తమ్ముళ్ల స్పీడు.. జనసేన జోరు.. కమలదళం ఉత్సాహానికి ఎదురుందా? అని ప్రశ్నించారు.. సూపర్ సిక్స్- సూపర్ హిట్ విజయోవత్సవ సభకు అశేషంగా వచ్చిన తరలి వచ్చిన మూడు పార్టీల శ్రేణులకు, ప్రజలకు, మహిళలకు ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యేందుకు అండగా నిలిచిన అన్నదాతకు, స్త్రీశక్తులకు, యువకిషోరాలకు వందనం. ఈ సభ రాజకీయాల కోసం, ఎన్నికల కోసం ఓట్ల కోసం కాదు.. 15 నెలల పాలనలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పడానికే ఈ సభ అన్నారు.. సూపర్ సిక్స్ పథకాలను- సూపర్ హిట్ చేశారని చెప్పడానికే ఈ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నాం అని వెల్లడించారు.
Read Also: IND vs UAE: యూఏఈతో మ్యాచ్.. ప్లేయింగ్ 11పై హింట్ ఇచ్చేసిన బౌలింగ్ కోచ్!
నేపాల్ దేశంలో ఆందోళనలు జరుగుతున్నాయి. అక్కడ మన తెలుగువాళ్లు 200 మంది చిక్కుకు పోయారు.. వారిని స్వస్థలాలకు తిరిగి తీసుకురావడానికి మంత్రి లోకేష్ కి బాధ్యతలు అప్పగించాం.. ఆయన రియల్ టైమ్ గవర్నెన్సులో ప్రతీ క్షణం సమీక్షిస్తూ చిక్కుకు పోయిన వారిని వెనక్కు రప్పించే ప్రయత్నంలో ఉన్నారు అని తెలిపారు చంద్రబాబు.. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదు. బాధ్యతగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు అన్నారు.. 57 శాతం మంది ప్రజలు ఓట్లేశారు. 94 శాతం స్ట్రైక్ రేట్ వచ్చింది. 164 సీట్లు కూటమికి ఇచ్చి ప్రతిపక్షానికి హోదా కూడా లేకుండా చేశారు.. గత పాలకులు ప్రజా వేదికను కూల్చి వేతతో విధ్వంసం మొదలు పెట్టి రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టింది. అవినీతి అక్రమాలు, అప్పులు, తప్పుడు కేసులతో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. పెట్టుబడుల్ని తరిమేసి పరిశ్రమలు రాకుండా చేశారు. 93 పథకాలను నిలిపేశారు అని ఆరోపించారు.. పేద, మధ్యతరగతి జీవితాలను మార్చేందుకు సూపర్ సిక్స్ గా హామీ ఇచ్చాం.. అధికారంలోకి రాగానే ఈ పథకాలను సూపర్ హిట్ చేశాం.. సూపర్ సిక్స్ అంటే అవహేళన చేశారు పెన్షన్ల సూపర్ సిక్స్ పై నాడు వాళ్లు ఏమన్నారో గుర్తుందా..? అని ప్రశ్నించారు..
Read Also: Modi-Trump: భారత్-అమెరికా మధ్య శుభపరిణామం.. త్వరలోనే వాణిజ్య చర్చలు
సూపర్ సిక్స్ అంటే హేళన చేశారు.. పింఛన్ల పెంపు అంటే అసాధ్యం అన్నారు… పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోల్ చేశారు.. మెగా డీఎస్సీ అవ్వదన్నారు.. దీపం వెలగదన్నారు… ఫ్రీ బస్సు కదలదన్నారు.. కూటమి ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది అని వెల్లడించారు సీఎం చంద్రబాబు నాయుడు..