ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎక్స్ లో స్పందించిన ఆయన.. ఆదాయాలు తగ్గిపోయి, అప్పులు పెరగటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. కాగ్ నివేదికలపై ఎక్స్ లో ట్వీట్ చేశారు జగన్..
జకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరో నారా రోహిత్.. తన పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రాజకీయాల్లోకి, సినిమాలోకి వస్తే ఎవరు ఆపారని ఎదురు ప్రశ్నించారు నారా రోహిత్... మొత్తంగా ఓ ఈవెంట్లో పవన్ కల్యాణ్ వాడిన మనల్ని ఎవడ్రా ఆపేది..? డైలాగ్ను గుర్తుచేసినట్టు అయ్యింది..
స్నేహితులే కాలయములుగా మారి భార్యను అసభ్యకరంగా దూషించడనే నేపంతో స్నేహితుడిని హత్య చేశాడు . రైల్వే స్టేషన్ లో సమోసాలు అమ్ముకునే ఇద్దరు స్నేహితుల మధ్య మద్యం మత్తులో వివాదం ఏర్పడింది. ఈ వివాదంలో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. తన భార్యను అసభ్యకరంగా మాట్లాడటంతో ఈ హత్యకు దారితీసింది. రాఖీ పండుగ రోజున జరిగిన ఈ హత్య సంచలనంగా మారింది..
ఘోర పరాజయం నుంచి కోలుకున్న వైసీపీ... క్రమంగా యాక్టివిటీ పెంచుతోంది. రాజకీయ పరిస్థితుల్ని సమీక్షించుకుంటూ... నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను మారుస్తూ... కేడర్ని రీ ఛార్జ్ మోడ్లోకి తీసుకువస్తోంది. అయితే... ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మాత్రం పూర్తిగా మ్యూట్ మోడ్లో ఉండటం ఏంటో అర్ధంగాక దిక్కులు చూస్తున్నారట కార్యకర్తలు. అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకలాపాలు దాదాపుదా నిలిచిపోయినట్టు కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.