ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షన జరిగిన సమావేశంలో.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.. రాష్ట్రంలో పౌరులందరికీ ఆరోగ్య ధీమాను కల్పిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.. ఆయుష్మాన్ భారత్ - ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది.. ఏడాది ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మరోసారి హస్తినబాట పట్టనున్నారు.. ఇవాళ రాత్రికి ఢిల్లీ చేరుకోనున్న ఆయన.. రాత్రి అక్కడే బస చేస్తారు.. ఇక, రేపు అనగా శుక్రవారం రోజు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు మంత్రి లోకేష్.. యోగాంధ్ర నిర్వహణపై ప్రధానికి వివరించనున్నారు.. యోగాంధ్ర పై తయారు చేసిన బుక్‌ను ఈ సందర్భంగా ప్రధాని మోడీకి అందజేయనున్నారు మంత్రి నారా లోకేష్.
విజయనగరంలో బొబ్బాదిపేటకు చెందిన బొబ్బాది హరీష్ (22) డీజే సౌండ్స్ కారణంగా మృతి చెందాడు. బుధవారం రాత్రి వినాయక ఊరేగింపు సందర్భంగా డీజే సౌండ్స్‌కు హరీష్ డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. వెంటనే జిల్లా సర్వజన ఆస్పత్రికి తరలించగా.. అక్కడ వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు.
పద్మభూషణ్ , దేశంలో మొదటి కళాకారుడుగా బుక్ ఆఫర్ రికార్డ్స్ లో స్థానం పొందడం.. వరుస సినీ విజయాలను.. ప్రజల విజయాలుగా భావిస్తున్నాను అన్నారు నందమూరి బాలకృష్ణ.. పదవులు నాకు ముఖ్యం కాదు... వాటికే నేను అలంకారమన్నది నా భావనగా అభివర్ణించారు.. ఈ విజయాలన్నీ తల్లిదండ్రులకు.. అంకితం చేస్తున్నాను అని వెల్లడించారు..
విజయవాడ - బెంగళూరు విమానానికి పెను ప్రమాదం తప్పింది.. గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగళూరు వెళ్లేందుకు విమానం టేక్ ఆఫ్ అవుతోన్న సమయంలో పక్షిని ఢీకొట్టింది విమానం.. దీంతో, విమానం రెక్కలు దెబ్బతిన్నాయి.. ఊహించని ఘటనతో షాక్ తిన్న పైలట్.. వెంటనే విమానాన్ని తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లోనే ల్యాండ్ చేశారు.. దీంతో, ప్రయాణికులు, సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు..
సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. ఒక చిన్న కాల్‌తో అమాయకుల బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ఓ రిటైర్డ్ హెడ్మాస్టర్కు కాల్ చేసి ఏకంగా 93 లక్షలు కొట్టేశారు. ఆమె ఖాతా నుంచి 10 సార్లు డబ్బు డ్రా చేసుకున్నారు కేటుగాళ్లు. అంతా అయిపోయాక మోసపోయామని పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. డిజిటల్ అరెస్ట్.. సైబర్ క్రిమినల్స్‌కు ఇదో ఆయుధం. అమాయకులు, చదువు రాని వారు దొరికితే చాలు.. సైబర్ కేటుగాళ్లు ఈ…
లిక్కర్ కేసులో మరిన్ని కీలకమైన ఆధారాలు సేకరించింది సిట్.. చెవిరెడ్డి, విజయనందా రెడ్డి కంపెనీల సోదాల్లో లావాదేవీలకు సంబంధించిన మరింత కీలకమైన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి..
నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది.. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.. సీఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది కేబినెట్.. ఎస్ఐపీబీ నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.. పలు సంస్థలకు భూ కేటాయింపులు, అసెంబ్లీ సమావేశాలపై చర్చించే అవకాశం ఉంది.. కాగా, ఈ నెల 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ఉంది ఏపీ…