YS Jagan Warns AP CM: ఏపీలో రైతులకు అందాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. రైతుల పక్షాన వారితో కలసి నిరసన తెలియజేస్తే.. పోలీసులతో మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తారా అని ప్రశ్నించారు. రైతుల తరఫున మేం నిరసనలు చేస్తే ఏం తప్పు అని అడుగుతున్నా.. ఎరువులు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతుంటే మాట్లాడకూడదా అన్నారు. ప్రజాస్వామ్యం కూని కావటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. మీరు రైతులకు అందివ్వాల్సిన ఎరువులు అందిస్తే ఈ పరిస్థితి ఉండదు కదా అన్నారు. మీరు సకాలంలో పట్టించుకుని ఉంటే మేం ఇవాళ ఆందోళనలు చేయాల్సిన అవసరం ఉండేది కదా.. ఎరువుల కోసం రైతులు రాత్రనక, పగలనక పనులు మానుకుని ఎదురు చూడాల్సిన వచ్చింది.. అర్ధరాత్రి సమయంలో వెళ్లి క్యూ లైన్లో వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తింది.. కనీసం కుప్పంలో కూడా చంద్రబాబు రైతులకు ఎరువులు ఇవ్వలేకపోయారు అని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Breaking : కేరళలో ‘కాంతార చాఫ్టర్ -1’ రిలీజ్ బ్యాన్ చేసిన ఎగ్జిబిటర్స్… కారణం ఇదే
అయితే, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఎరువులు దొరక్కపోతే చంద్రబాబు ఎక్కడైనా దూకి చావాలి అని వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనూ పరిస్థితి ఇలాగే ఉందన్నారు. వాళ్ళిద్దరూ ఎక్కడైనా దూకి చావండి అన్నారు. గత ఐదేళ్ల పాలనలో ఎప్పుడైనా రైతలు ఇలాంటి అగచాట్లు పడటం చూసారా.. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని ప్రశ్నించారు. అదే ముఖ్యమంత్రి పదవిలో అప్పుడు జగన్ ఉన్నాడు.. ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు.. అప్పుడు అదే అధికారులు.. ఇప్పుడు అదే అధికారులు.. కానీ, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది.. రైతులకు మంచి చేయాలనే తపన నాకు ఉంది కాబట్టే అప్పుడు ఇబ్బందులు లేవు.. దీంట్లో కూడా స్కాములు చేసి దోచుకోవాలని చంద్రబాబు సర్కార్ చూస్తుంది కాబట్టే రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సీజన్ లో రైతులు ఎంత పంట వేస్తారు.. ఎంత ఎరువులు కావాలని లెక్కలు ఉన్నాయి కదా.. అన్నీ ముందే చూసుకుంటే ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని జగన్ అడిగారు.
Read Also: YS Jagan Setairs Chandrababu: చంద్రబాబు సొంత నియోజక వర్గంలోనూ ఎరువులు దొరకట్లేదు..
ఇక, గత ఏడాదితో పోలిస్తే 97 వేల టన్నులు అధికంగా ఇచ్చామని చంద్రబాబు చెప్పారని జగన్ తెలిపారు. 6.65 మెట్రిక్ టన్నులు యూరియా తెప్పించాం అని చెప్పారు.. అధికంగా యూరియా ఇచ్చామని ముఖ్యమంత్రి చెప్పారు.. అంత సప్లై జరిగి ఉంటే రైతులు ఎందుకు రోడ్డెక్కారు.. ఆర్బీకే, ఈ క్రాప్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు.. అక్రమంగా ఎరువులు తరలిస్తూ టీడీపీ నేతలు పట్టుబడ్డారు.. ప్రభుత్వం దగ్గరి నుంచి యూరియా తీసుకుని టీడీపీ నేతలు బ్లాక్ చేసి బస్తాలు అదనంగా 200 నుంచి 250 వరకు అదనంగా వసూలు చేశారు.. బ్లాక్ మార్కెట్ లో ఎరువులు అమ్మటం 200 కోట్ల స్కాం జరిగిందన్నారు. రైతులను పీడించి కింద నుంచి పైదాకా పంచుకున్నారు.. మా ప్రభుత్వ హయాంలో తప్పు చేయాలంటే భయపడేవారు.. ఈ ప్రభుత్వ హయాంలో చిత్తశుద్ధితో ఎక్కడా పనులు జరగడం లేదు.. ఇప్పుడంతా దోచుకో, తినుకో, పంచుకో అన్నట్లుగా ఉందని వైఎస్ జగన్ ఆరోపించారు.