YS Jagan Mohan Reddy: మెడికల్ కాలేజీలను చంద్రబాబు పప్పుబెల్లాలకు అమ్ముకుంటున్నారు..
- చంద్రబాబు మూడుసార్లు సీఎంగా చేసినా ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదు..
- మెడికల్ కాలేజీలను చంద్రబాబు పప్పుబెల్లాలకు అమ్ముకుంటున్నారు..
- పులివెందుల మెడికల్ కాలేజీకి NMC 50 సీట్లు అనుమతులు ఇస్తే చంద్రబాబు వద్దన్నారు..
- మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తే, రాష్ట్రప్రజలకే మేలు జరుగుతుంది: వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Mohan Reddy: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో మొత్తం 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి అని గుర్తు చేశారు. అయితే, చంద్రబాబు మూడుసార్లు సీఎంగా పని చేసినా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా కట్టలేదు అని ఎద్దేవా చేశారు. మేం అధికారంలోకి వచ్చాక 17 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తీసుకొచ్చాం.. ఒక్కో మెడికల్ కాలేజీ రూ.500 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేశాం.. కానీ, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడమంటే అవినీతికి పరాకాష్ట అని వైఎస్ జగన్ అన్నారు.
Read Also: Kakani Govardhan Reddy: జగన్ను తిడితే పదవిలు వస్తాయని పోటీ పడి మరీ నోరు పారేసుకుంటున్నారు..!
Also Read
- OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
- Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
- AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
- CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
ఇక, పులివెందుల మెడికల్ కాలేజీకి NMC 50 సీట్లు అనుమతులు ఇస్తే చంద్రబాబు వద్దని వెనక్కి పంపారు అని వైసీపీ చీఫ్ జగన్ పేర్కొన్నారు. ఇంతకీ చంద్రబాబు మనీషా రాక్షసుడా మీరే ఆలోచించాలని తెలిపారు. మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తే, రాష్ట్ర ప్రజలకే మేలు జరుగుతుంది అన్నారు. మా ప్రణాళిక అమలు జరిగి ఉంటే, ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పిడుగురాళ్ల కాలేజీలు గతేడాదే అందుబాటులోకి వచ్చేవి.. ఈ ఏడాది మరో 6 మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చే వాళ్లమని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రులు లేకుండా ప్రైవేట్ దోపిడీని ఆపేది ఎవరు అని ప్రశ్నించారు. గవర్నమెంట్ ఆస్పత్రులను నడపడం అంటే ఒక బాధ్యత.. ఇక, మెడికల్ కాలేజీలు ప్రారంభమైతే, నాకు క్రెడిట్ వస్తుందని రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయడం ఎంత వరకు కరెక్ట్ అని వైఎస్ జగన్ క్వశ్చన్ చేశారు.
Read Also: Sweden: షాకింగ్ ఘటన.. ప్రెస్‌మీట్‌లో ఉండగా కుప్పకూలిన స్వీడన్ మంత్రి.. వీడియో వైరల్
ఇక, ఆంధ్ర రాష్ట్రంలో మేము అధికారంలో నుంచి దిగిపోయే నాటికి రూ. 3 వేల కోట్ల పనులు జరిగాయని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. మిగిలిన రూ. 5 వేల కోట్లకు నాబార్డ్ అనుమతులు వచ్చాయి, కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేయడానికి అంగీకరించింది అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో రూ. 5 వేల కోట్లు ఖర్చ చేయలేరా అని అడిగారు. మెడికల్ కాలేజీలను చంద్రబాబు పప్పుబెల్లాలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!