ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.. పదేళ్లుగా ఒక హత్య కేసులో స్టే ఎలా పొడిగిస్తున్నారని ప్రశ్నించింది న్యాయస్థానం.. ఇకపై వాయిదాలు వేయలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది..
ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతోంది ఉపరితల ఆవర్తనం.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.. ఇక, అల్పపీడనం ప్రభావంతో ఇవాళ విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. ఆరెంజ్ బులెటిన్ హెచ్చరికలు జారీ చేసింది విశాఖపట్నం వాతావరణ కేంద్రం..
అనారోగ్య ప్రదేశ్ ను ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ దిశగా తీసుకు వెళ్తున్నాం అన్నారు.. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ని మరింత విస్తృతం చేస్తున్నాం అన్నారు.. క్యాన్సర్ మహమ్మారిగా తయారైంది.. ఐసీఎంఆర్ లెక్కలు ప్రకారం దేశంలో 8.74 లక్షలు మంది, మన రాష్ట్రంలో 42 వేల మంది క్యాన్సర్ తో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు సత్యకుమార్..
ఒకటో తేదీ పండుగలా పెన్షన్ ల పంపిణీ సాగుతోంది.. ఒక్కరోజులోనే 99 శాతం పంపిణీ పూర్తి చేస్తున్నామని వెల్లడించారు.. గత ప్రభుత్వం ఎన్నికల ముందు పెన్షన్ లు ఇంటి దగ్గర ఇవ్వకుండా వృద్ధులను ఇబ్బందిపెట్టింది.. కానీ, విజన్ ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుపరిపాలనతో పెన్షన్ ల ప్రక్రియ గాడిలో పడిందన్నారు..
స్టీల్ ప్లాంట్‌పై అబద్దాలు చెబుతున్నారు.. కానీ, దొడ్డిదారిన కేంద్ర ప్రభుత్వమే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తోందని మండిపడ్డారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు..
మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై హాట్ కామెంట్స్ చేశారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే థామస్.. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు ధర్మ చెరువు గ్రామంలో ఎన్టీఆర్ పెన్షన్లు పంపిణీ చేసిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. నారాయణస్వామిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. నారాయణస్వామి ఓ పిచ్చోడు, అవినీతిపరుడు అని విరుచుకుపడ్డారు.. సిట్ అధికారులు మీ ఇంటికొస్తే సాష్టాంగంగా వారి కాళ్లపై పడిపోయావు.. దీనికన్నా గలీజ్ ఏమైనా ఉందా? అని ఫైర్ అయ్యారు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు.. ఇప్పుడు తన రాజకీయ జీవితంలో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. సీబీఎన్ మొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి నేటికి 30 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు.. ఆయన 1995 సెప్టెంబర్ 1వ తేదీన తొలిసారిగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.. ఈ సుదీర్ఘ నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో అనేక ఒడిదుడుకులను.. ఎత్తుపల్లాలను చూసిన ఆయన.. ఎన్నో ఆరోపణలు, విమర్శలకు కూడా ఎదుర్కొన్నారు..