పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. వారి పాలిట యముడిగా మారాడు.. ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులను దారుణంగా హత్య చేసి.. పెట్రోల్ పోసి తగలబెట్టాడు.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం బోయలపల్లిలో తీవ్ర విషాదాన్ని నింపింది..
శేషాచలం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఎర్రచందనం. అయితే, అంతేస్థాయిలో అక్కడ వన్య ప్రాణులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చిరుతపులుల సంచారం ఎక్కువైంది. ఏనుగులు, ఇతర వైల్డ్ లైఫ్ కూడా చాలానే ఉంది. వాటిబారి నుంచి మనుషులను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో.. వేటగాళ్ల నుంచి వన్యప్రాణులను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే అటవీశాఖ టెక్నాలజీ పరంగా కొన్ని విప్లవాత్మక అడుగులు వేస్తోంది.
అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం ముసలమ్మ దేవాలయంలో నెల రోజుల క్రితం హుండీ చోరీ జరిగింది.. అయితే, అనూహ్యంగా చోరీ సొత్తును నిన్న రాత్రి ఆలయ ఆవరణలో వదిలేసి వెళ్లారు దొంగలు.. ఇక, సదరు దొంగలు పడేసి వెళ్లిపోయిన నగదును వెలికితీసి పోలీసుల సమక్షంలో లెక్కించారు స్థానికులు..
మన ప్రాంతాలలో తయారయ్యే ఉత్పత్తులనే కొనుగోలు చేయాలి.. మళ్లీ దేశ వ్యాప్తంగా స్వదేశీ ఉద్యమం ప్రారంభం కావాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్..
బెజవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఫోకస్ పెట్టింది. దసరా మహోత్సవాల ప్రణాళికలు, భక్తుల రద్దీ నిర్వహణ, క్యూ లైన్లు, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్, త్రాగునీరు, వైద్య సహాయం, శానిటేషన్ వంటి అంశాలను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్షించారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొండపై టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు క్యూ లైన్ విధానంలో, వసతుల కల్పనలో మార్పులు చేస్తూ వచ్చింది. 1985లో మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. 2001లో రెండో క్యూ కాంప్లెక్స్‌ను ప్రారంభించింది. ఈ రెండు కాంప్లెక్స్‌లు చాలకపోవడంతో నారాయణగిరి ఉద్యానవనంలో 2014లో తాత్కాలిక క్యూలైన్లను ఏర్పాటు చేసింది. 2019లో నారాయణగిరి ఉద్యానవనంలో కంపార్ట్మెంట్లను అందుబాటులోకి తెచ్చింది.
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విమానం రద్దు కావడంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. గురువారం రోజు రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికులు నిరసనకు దిగారు.. సమాచారం లేకుండా స్పైస్ జెట్ విమాన సర్వీస్ రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు..
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు భద్రత కల్పించింది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యేకు (1+1) గన్మెన్లను కేటాయించింది ప్రభుత్వం.. తనకు భద్రత కల్పించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు వర్మ.. దీంతో, ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించింది.