తెలంగాణ రాష్ట్రంలో రేపు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని భావించే ఏపీకి చెందిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో ఓటు హక్కు కలిగి ఉన్న ఏపీ ఉద్యోగులకు రేపు ఓటు వేసేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఉద్యోగుల సంఘం నేతలు చేసిన విజ్ఞప్తికి ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు ఇచ్చారు.
జోగి రమేష్ మాట్లాడుతూ.. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామన్నారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఓటు ఒక చోటే ఉండాలని కోరామని చెప్పుకొచ్చారు. కొంత మందికి తెలంగాణ, ఏపీ రెండు చోట్లా ఓట్లు ఉన్నాయి.. ఇలాంటి వాటిని వెరిఫై చేసి చర్యలు తీసుకోవాలని విఙప్తి చేశామని ఆయన చెప్పుకొచ్చారు.
సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరుగుతాయన్నారు. మరి పార్లమెంట్ ఎన్నికలకు ఎప్పుడు వెళ్తారో.. అనేది తెలియదని చెప్పారు. అట్టడుగు వర్గాల రాజకీయ సాధికారత సాధించడమే సీఎం జగన్ లక్ష్యం అని ఆయన చెప్పుకొచ్చారు.
Telangana Assembly Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి.. మంగళవారం సాయంత్రం 5 గంటలకే ప్రచారానికి తెరపడింది.. ఇప్పుడు ప్రలోభాల పర్వం జోరుగా సాగుతున్నట్టు కొన్ని ఘటనలు చూస్తే అర్థమవుతోంది.. గురువారం రోజు పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. అయితే, ఎన్నికల ఫలితాలపై తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో జోరుగా బెట్టింగ్లు కొనసాగుతున్నాయట.. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కోట్ల రూపాయలు పందెం…
పారిశ్రామిక రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించాం.. 6 లక్షల ఉద్యోగాల దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పలు పరిశ్రమలు వర్చువల్ గా ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్, ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పారిశ్రామిక రంగం పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోంది. కలెక్టర్లు కూడా ఈవిషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
CM YS Jagan: సఫాయి కార్మికుల కోసం క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. స్వచ్ఛత ఉద్యమి యోజన కింద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా లబ్దిదారులకు 100 మురుగుశుద్ధి వాహనాల అందజేశారు.. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి సఫాయి కార్మికులు వినియోగించే క్లీనింగ్ యంత్రాలను జెండా ఊపి ప్రారంభించారు ఏపీ సీఎం.. ఇక, ఈ కార్యక్రమంలో మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి,…