నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గర ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య ఉద్రక్తతపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదు అన్నారు.. ఆంధ్ర భూభాగంలో తెలంగాణ పోలీసులు ఉంటున్నారు.. మా నీరు మా రైతులకు విడుదల చేయాలంటే తెలంగాణ అనుమతి ఎందుకు?.. మా భూభాగంగలోకి మా పోలీసులు వెళ్తే దండయాత్ర ఎలా అవుతుంది? అని ఆయన ప్రశ్నించారు.
కాకినాడ తీరంలో అగ్నిప్రమాదం జరిగింది. సముద్రంలో వేటకు వెళ్తున్న మత్య్సకారుల బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు బోటు మొత్తం అంటుకున్నాయి. దీంతో మత్య్సకారులు లైఫ్ జాకెట్లు ధరించి సముద్రంలోకి దూకేశారు. ఇక, విషయం తెలుసుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి రెస్యూ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ నెల 7వ తారీఖున జగనన్న విద్యా దీవెన డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. కర్నూలు పర్యటనలోనే జగనన్న విద్యా దీవెన డబ్బులను సీఎం జగన్ రిలీజ్ చేయనున్నారు.
తిరుమల శ్రీవారిని ఇవాళ ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు వేద ఆశీర్వాచనం అందజేసి ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వేంకటేశ్వర స్వామి పాదాల చెంత పుట్టిన నేను.. అంచెలంచెలుగా ఏదుగుతూ వచ్చాను అని ఆయన పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా కొనసాగుతుంది. క్యూ కాంప్లెక్స్లో 5 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉంన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ అమరావతికి రానున్నారు. నేటి మధ్యాహ్నాం జనసేన పార్టీ విస్తృత స్థాయీ సమావేశంలో పవన్ పాల్గొననున్నారు. ఎన్నికలకు లీడర్లు, కేడరును సమాయత్తం చేస్తూ జనసేన ఈ సమావేశం నిర్వహిస్తుంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మరి కొద్ది నెలల్లో రాష్ట్రంలో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో కొత్త ఇనిషియేటివ్.. పోలీసు అధికారుల పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుమలలో శ్రీవారిని దర్శనం చేసుకుని అమరావతికి రానున్నారు. తిరుపతి నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు గన్నవరం చేరుకోనున్నారు.