ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబు కేసులపై విచారణ జరగనుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ చేయనుంది న్యాయస్థానం. అయితే, చంద్రబాబుకి బెయిల్ ఇవ్వద్దని ఇప్పటికే 470 పేజీలతో అడిషనల్ అఫిడవిట్ ఫైల్ చేసింది.. సీఐడీ. అటు అమరావతి అసైన్డ్ భూములు కొనుగోలు కేసులో మాజీ మంత్రి నారాయణ ఇతరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లు మీద విచారణ జరగనుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో.. అధికారులు పోలింగ్ కు ఏర్పాట్లు చేశారు. దీంతో పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకుంటున్నారు.