అనంతపురం జిల్లాలో ఇవాళ తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం గ్రామీణ మండలం చెన్నంపల్లి దగ్గర ఆగి ఉన్న లారీని మరో ఐచర్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, పలు ప్రాంతాల్లో ఎక్కడపడితే అక్కడ లారీలు భారీ వాహనాలను నిలుపుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదాలు అరికట్టడంలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నారు. మొద్దు నిద్రలో ఉండడంతో ఈ ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.
Read Also: Salaar: మరి కొన్ని గంటల్లో విధ్వంసం జరగబోతుంది…
తమ కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించడంతోనే ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నప్పటికీ అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడడం లేదని వాపోతున్నారు. ప్రజా సర్వెంట్లుగా ఉండవలసిన వారు ప్రజాభక్షకులుగా తయారవుతున్నారని ప్రజలు ఎన్ని మార్లు విన్నవించుకున్న అరణ్య రోదనగానే మారుతుందని ప్రజలు విసిగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆగి ఉన్న లారీని మరో ఐచర్ వ్యాన్ ఢీ కొట్టడంతో సంఘటన ప్రదేశంలోనే ముగ్గురు మృతి చెందారు.