Anganwadi Strike: ఏపీలో ఐదో రోజు కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Protest: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు మరోసారి విఫలమయ్యాయి. దీంతో అంగన్వాడీ సిబ్బంది ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఏపీ సర్కార్ ఓవైపు వలంటీర్లతో అంగన్వాడీ సెంటర్లు తెరిపిస్తూనే మరోవైపు అంగన్వాడీ సిబ్బందితో చర్చలు చేస్తుంది. అయితే, నిన్న జరిగిన మూడో విడత చర్చలు కూడా ఫలించలేదు. అటు అంగన్వాడీ సిబ్బంది.. ఇటు ప్రభుత్వం మెట్టు దిగి రావడం లేదు.. దీంతో సమ్మె కొనసాగుతోంది. ఇవాళ మరోసారి అంగన్వాడీ యూనియన్లు నిరవాధిక సమ్మెకు దిగింది.
Read Also: CM Revanth Reddy: త్వరలోనే కొత్త రేషన్ కార్డులు.. రేవంత్ సర్కార్ చర్యలు
Also Read
అయితే, అంగన్వాడీల చాలా అంశలను పరిగణలోకి తీసుకుంటామని మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. అన్నింటికీ ఓకే చెప్పిన మంత్రివర్గ ఉపసంఘం వేతనాల పెంపుపై మాత్రం వెనక్కి తగ్గుతోంది అని అంగన్వాడీలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీతో పాటు సుప్రీంకోర్టు సూచించినట్లు తమ జీతాలు పెంచాలని వారు కోరుతున్నారు. అంగన్‌వాడీ వర్కర్లకు 26 వేల రూపాయలు హెల్పర్లకు 20 వేల రూపాయలు చేయాలని ఆందోళన చేస్తున్నారు. జీతాలు పెంచేందుకు మాత్రం మంత్రివర్గ ఉపసంఘం అంగీకరించడం లేదు. ప్రస్తుతానికి జీతాలు పెంచే పరిస్థితిలేదని ఏపీ ప్రభుత్వం చెప్పేసింది.
Read Also: Congress: కాంగ్రెస్ భారీ ప్లాన్.. 28న నాగ్‌పూర్‌లో 10 లక్షల మందితో మెగా ర్యాలీ
ఇక, జీతాల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో అంగన్వాడీ సిబ్బంది సమ్మె కొనసాగిస్తున్నట్టు వెల్లడించాయి. ప్రభుత్వం మొండి వైఖరితో ఉండటం వల్లే సమ్మెకు దిగుతున్నట్లు అంగన్వాడీ యూనియన్లు తెలిపాయి. బెదిరించి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు వార్నింగ్ ఇచ్చారు. సుప్రీం గైడ్‌లైన్స్ అనుసరించి జీతాల పెంపు, గ్రాట్యూటి అంశాన్ని పరిశీలిస్తామంటే సమ్మె విరమించడానికి తాము రెడీగా ఉన్నామని అంగన్వాడీ యూనియన్లు ప్రకటించాయి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు