NIA: ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్టులో తెలుగు యువకులు.. నిషేధిత పీఎఫ్ఐతో సంబంధాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NIA: నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) ఉక్కుపాదం మోపుతోంది. ఈ సంస్థలో సంబంధాలు ఉన్న వ్యక్తుల కోసం వేటాడుతోంది. ఇదిలా ఉంటే ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. వీరిని పట్టుకునేందుకు ఎన్ఐఏ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కేరళతో పాటు తెలంగాణ, కర్ణాటక, ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు, కీలక నేతలపై ఎన్ఐఏ ఉక్కుపాదం మోపింది. ప్రస్తుతం తెలంగాణ, ఏపీలకు చెందిన ముగ్గురి కోసం పారితోషకం ప్రకటించింది. వీరికి సంబంధించిన సమాచారం ఇస్తే పారితోషకం ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
Read Also: Rohit Sharma: ముంబై ఇండియన్స్ కు రోహిత్ శర్మ ఫ్యాన్స్ షాక్..
Also Read
- CEC Gyanesh Kumar SIR Row: సుప్రీంకోర్టుకు SIR వివాదం.. CEC జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్ దాఖలు
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- Success Story: రూ.150తో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 లక్షల టర్నోవర్.. గృహిణి అద్భుత విజయం..!
- PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
తెలంగాణ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురకు చెందిన అబ్దుల్ సలీం, నిజామాబాద్ మల్లేపల్లికి చెందిన ఎండీ అబ్దుల్ అహద్ అలియాస్ ఎంఏ అహద్, ఆంధ్రప్రదేశ్ నెల్లూర్ జిల్లాకి చెందిన షేక్ అహ్మద్ గురించి సమాచారం తెలిసిన వారు వాట్సాప్ నెంబర్ 9497715294కి తెలియజేయాలని ఎన్ఐఏ కోరింది. తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ప్రకటించింది.
పీఎఫ్ఐ సంస్థ ఉగ్రవాద కార్యకలపాలకు పాల్పడేందుకు ప్లాన్ చేస్తుండటంతో గతేడాది సెప్టెంబర్ నెలలో ఎన్ఐఏ, ఈడీలు ఏకకాలంలో ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లోని 100కి పైగా ప్రదేశాల్లో దాడులు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, కర్నూలు, నెల్లురులో దాడులు నిర్వహించారు. పలువురిని అరెస్ట్ చేశారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురితో పాటు కేరళలో 11 మంది, కర్ణాటకలో ఐదుగురు, తమిళానాడులో ఐదుగురిని మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చింది ఎన్ఐఏ.
https://twitter.com/NIA_India/status/1735624275045015813
- Tags
- Andhra Pradesh
- NIA
- PFI
- telangana
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
IND vs WI: రుతురాజ్, నితీష్ ఇన్.. ఆ ఇద్దరు స్టార్లకు నో ఛాన్స్.. వెస్టిండీస్‌తో తొలి వన్డేకు భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
-
D56 : నాగవంశీ – ధనుష్ – తమిళరసన్ పచ్చముత్తు.. మొదలుపెట్టారు
-
Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
ట్రెండింగ్
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!