* నేటి నుంచి తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో వైసీపీ సామజిక సాధికార బస్సు యాత్ర.. హాజరుకానున్న మంత్రులు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరావు, పలువురు ఎమ్మెల్యే లు ఎమ్మెల్సీలు.. కృష్ణంపాలెం నుంచి దేవరపల్లి వరకు ర్యాలీ.. ఆ తరువాత బహిరంగ సభ..
పశ్చిమ గోదావరి ..
* నేడు మంత్రి కొట్టు సత్యనారాయణ ఉదయం 11 గంటల నుంచి ఆఫీసులో అందుబాటులో ఉంటారు.. సాయంత్రం 6 గంటలకు తాడేపల్లిగూడెం నుంచి విజయవాడకు పయనం..
* నేడు నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
* తూర్పుగోదావరి జిల్లాలో 300 కోట్ల రూపాయాలతో రాజమంఢ్రి రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులు.. పూర్తికానున్న ప్లాట్ ఫాం పనులు 4,5.. ఈ కార్యక్రమంలో పాల్గొననున్న ఎంపీ మార్గాని భరత్ రామ్
* నేడు నందిగామలో వైసీపీ సామాజిక బస్సు యాత్ర.. హాజరు కానున్న మంత్రులు అంజద్ బాషా, విడదల రజనీ, జోగి రమేష్ ఇతరులు..
* నేడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పర్యటించనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి.. ఉదయం 10.30 గంటలకు టిడ్కో ఇళ్ల సముదాయాలను సందర్శించి లబ్ధిదారులతో ముఖాముఖి.. 11 గంటలకు అడబాల గార్డెన్స్ లో మీడియా సమావేశం.. అనంతరం జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు శక్తి కేంద్ర ప్రముఖులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు..
* నేడు విజయవాడలో బీసీలకు బెజవాడ ఎంపీ టికెట్ కేటాయించాలని బీసీ సంఘం అధ్వర్యంలో సమావేశం..
* నేడు ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన.. మ. 3 గంటలకు మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్ష..
* నేడు మంత్రి తుమ్మల పర్యటన.. భద్రాచలంలో భక్తుల కోసం నిర్మించిన కమ్మ వసతి గృహాన్ని ప్రారంభించనున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..
* నేడు నిర్మల్ కు బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ సునీల్ బన్సల్.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమీక్షలో పాల్గొననున్న బన్సల్.. లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరుకానున్న బన్సల్..
* నేటి నుంచి తిరుపతిలో ధనుర్మాసం ప్రారంభం.. ఇవాళ్టి నుంచి జనవరి 14 వరకు శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ రద్దు.. సుప్రభాతంకు బదులుగా స్వామివారికి తిరుప్పావైతో మేల్కోలుపు..
* నేడు భద్రాద్రి రామాలయంలో ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా వామనావతారంలో దర్శనం ఇవ్వనున్న శ్రీరాముడు..
* నేడు దుండిగల్ ఎయిర్ ఫోర్స్ లో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్..
ముఖ్య అతిథిగా హాజరుకానున్న రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్..
పరేడ్ లో ప్రదర్శన చేయనున్న యువ పైలెట్లు..
* నేడు సూరత్ డైమండ్ బోర్స్ భవనాలను ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సూరత్ డైమండ్ బోర్స్ నిర్మాణం.. 65 వేల మంది వ్యాపారం చేసుకునేలా సూరత్ డైమాండ్ బోర్స్ భవన నిర్మాణం..
* నేడు భారత్- దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే.. మధ్యాహ్నం 1.30 గంటలకు జోహన్నెస్ బర్గ్ వేదికగా మ్యాచ్..