ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్టులో తెలుగు యువకులు.. నిషేధిత పీఎఫ్ఐతో సంబంధాలు..
నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) ఉక్కుపాదం మోపుతోంది. ఈ సంస్థలో సంబంధాలు ఉన్న వ్యక్తుల కోసం వేటాడుతోంది. ఇదిలా ఉంటే ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. వీరిని పట్టుకునేందుకు ఎన్ఐఏ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కేరళతో పాటు తెలంగాణ, కర్ణాటక, ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు, కీలక నేతలపై ఎన్ఐఏ ఉక్కుపాదం మోపింది. ప్రస్తుతం తెలంగాణ, ఏపీలకు చెందిన ముగ్గురి కోసం పారితోషకం ప్రకటించింది. వీరికి సంబంధించిన సమాచారం ఇస్తే పారితోషకం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తెలంగాణ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురకు చెందిన అబ్దుల్ సలీం, నిజామాబాద్ మల్లేపల్లికి చెందిన ఎండీ అబ్దుల్ అహద్ అలియాస్ ఎంఏ అహద్, ఆంధ్రప్రదేశ్ నెల్లూర్ జిల్లాకి చెందిన షేక్ అహ్మద్ గురించి సమాచారం తెలిసిన వారు వాట్సాప్ నెంబర్ 9497715294కి తెలియజేయాలని ఎన్ఐఏ కోరింది. తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ప్రకటించింది.
ములుగు జిల్లాలో సీతక్క పర్యటన.. షెడ్యూల్ ఇదే..
ములుగు జిల్లాలో రాష్ట్ర పంచాయితీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు దనసరి అనసూయ సీతక్క పర్యటన ఖరారైంది. ఇవాళ ములుగు మండలం జాకారం గ్రామ పంచాయతీ పరిధిలోని గట్టమ్మ ఆలయాన్ని ఉదయం 10 గంటలకు సందర్శించి పూజలు.. అనంతరం మధ్యాహ్నం 3:00 గంటలకు మేడారం జాతర 2024కి సంబంధించి జిల్లా యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.
బస్సుల్లో జెంట్స్‌కు సీట్లు కేటాయించండి.. నిజామాబాద్ లో వ్యక్తి ఆందోళన
తెలంగాణ ప్రభుత్వం ‘మహాలక్ష్మి’ పథకం కింద మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడి నుంచైనా మహిళలు ఫ్రీగా ప్రయాణించవచ్చు. మహిళలు ఐడీ కార్డు చూపించి జీరో టికెట్ తీసుకుని ప్రయాణించవచ్చు. అయితే ఈ పథకం అమలుతో బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇదిలా ఉండగా గతంలో బస్టాండ్‌లో డిపో అధికారులు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ప్రయాణికులను ఆర్టీసీ బస్సులో ఎక్కించాలంటూ ప్రచారం నిర్వహించేవారు. ఎంత పిలిచినా.. ఆర్టీసీ బస్సులు ఎక్కడం లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. మహిళలు బస్సులు ఎక్కేందుకు లేస్తున్నారు. కొందరు డ్రైవర్ సీట్లు వదిలేసి బస్సుల్లో కూర్చున్నారు. అయితే మహిళల సంఖ్య పెరిగినప్పుడు సీట్లు దొరకని పరిస్థితులు నెలకొంటున్నాయి. పురుషుల సీట్లు కూడా ఫుల్ అవుతున్నాయి. లేడీస్ బస్సులు ఆడవాళ్ళకి మాత్రమే కాబట్టి మా బస్సుల్లో ఎందుకు ఎక్కుతున్నావ్ అంటూ లేచిపోయే పరిస్థితి వచ్చింది. బస్సులో మగవాళ్లు నిలబడి.. ఇది మా బస్సు అంటూ మగవాళ్ల సీట్లలోంచి లేచి ఆడవాళ్ల సీట్లో కూర్చున్నారు. ఇది లేడీస్ సీట్ కాదు అన్నా కూడా గొడవకు దిగుతున్నారు. దీంతో ఓ వ్యక్తి రేవంత్ సర్కార్‌కు విజ్ఞప్తి చేశాడు. బస్సుల్లో పురుషులకు కూడా స్లీట్‌లు కేటాయించాలని అన్నా కోరారు.
నేటి నుంచి తిరుమలలో ధనుర్మాసం ప్రారంభం..
ఇవాళ్టి నుంచి తిరుమలలో ధనుర్మాసం ప్రారంభం అయింది. దీంతో నేటి రేపటి నుంచి జనవరి 14వ తేది వరకు శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. నెల రోజులు పాటు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైతో స్వామివారికి మేల్కోలుపు ఉండనుంది. ఇక, 19వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళపాదపద్మారాదన సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రద్దు చేసింది. రేపు సిఫార్సు లేఖల స్వీకరణను సైతం రద్దు చేసినట్లు టీటీడీ పేర్కొనింది.
అనంతపురంలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
అనంతపురం జిల్లాలో ఇవాళ తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం గ్రామీణ మండలం చెన్నంపల్లి దగ్గర ఆగి ఉన్న లారీని మరో ఐచర్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, పలు ప్రాంతాల్లో ఎక్కడపడితే అక్కడ లారీలు భారీ వాహనాలను నిలుపుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదాలు అరికట్టడంలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నారు. మొద్దు నిద్రలో ఉండడంతో ఈ ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.
ప్రపంచంలో ఎక్కడైనా చికిత్స తీసుకున్న.. రిలయన్స్ రూ.8.3కోట్ల ఆరోగ్య బీమా
మీకు ప్రయాణంలో లేదా వ్యాపార పర్యటనలో విదేశాలకు వెళ్లినప్పుడు అకస్మాత్తుగా మీ ఆరోగ్యం క్షీణించిందా. మీకు విదేశాల్లో కూడా చికిత్స సౌకర్యాలు కల్పించే ఆరోగ్య బీమా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ఈసారి అదే తరహా హెల్త్ ప్లాన్‌ను ప్రారంభించింది. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ భారతీయ కస్టమర్ల కోసం ‘రిలయన్స్ హెల్త్ గ్లోబల్’ పాలసీని ప్రారంభించింది. దీని సహాయంతో భారతీయ ప్రజలు ప్రపంచ స్థాయి ఆరోగ్య సౌకర్యాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఈ పాలసీ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు సమగ్రమైన ఆరోగ్య రక్షణను అందిస్తుంది. ఈ ఆరోగ్య బీమా కింద వినియోగదారులు క్యాన్సర్, బైపాస్ సర్జరీ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సకు కూడా కవర్ పొందుతారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఇలాంటి వ్యాధి వస్తే దాని చికిత్సకు అయ్యే ఖర్చు ఈ బీమా పరిధిలోకి వస్తుంది.
మరి కొన్ని గంటల్లో విధ్వంసం జరగబోతుంది..
డిసెంబర్ 22న రానున్న సలార్ హైప్ మొదలయ్యింది, ఎక్కడ చూసినా సలార్ సౌండ్ వినిపిస్తూనే ఉంది. ఈ సౌండ్ కి కారణం ఒక్క ట్రైలర్ మాత్రమే. ఇటీవలే రిలీజైన సలార్ ట్రైలర్ దెబ్బకు 24 గంటల్లో 116 మిలియన్ల వ్యూస్ వచ్చి సరికొత్త డిజిటల్ రికార్డ్ క్రియేట్ అయ్యింది. ఇంతలా సెన్సేషన్ క్రియేట్ చేసిన సలార్ ట్రైలర్‌ను పృధ్వీరాజ్ సుకుమారన్ చుట్టే కట్ చేశాడు ప్రశాంత్ నీల్. మూడున్నర నిమిషాలకు పైగా ఉన్న ఈ ట్రైలర్‌లో ప్రభాస్ కనిపించింది చాలా తక్కువ. అలాగే… ఈ ట్రైలర్‌లో కథ చెప్పే ప్రయత్నం చేశాడు నీల్. ఈ కారణంగా ట్రైలర్ లో యాక్షన్ కట్ షాట్స్ తక్కువగా పడ్డాయి. అందుకే… ప్రభాస్ ఫ్యాన్స్‌కు అసలు సిసలైన మాస్ ఫీస్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు ప్రశాంత్ నీల్. ఫుల్ మీల్స్ పెట్టేలా రెండో ట్రైలర్ కట్ చేసాడు. అంతేకాదు ఈ హై ఓల్టేజ్ ట్రైలర్ ని ఈరోజే బయటకు వదలబోతున్నారు. డిసెంబర్ 17న, అంటే సినిమా రిలీజ్‌కు సరిగ్గా 5 రోజుల ముందు రెండో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో గూస్ బంప్స్ ఫైట్స్ సీన్స్‌ను ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడట. ఈ ఒక్క ట్రైలర్ సలార్ ప్రీరిలీజ్ ఈవెంట్ రేంజులో హైప్ పెంచుతుందని సమాచారం. ఇప్పటికే ఉన్న అంచనాలకు పీక్స్‌కు తీసుకెళ్లేలా ఈ ట్రైలర్ 2 ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్ సెకండ్ ట్రైలర్ సాలిడ్ గా బయటకి వస్తే సలార్ సీజ్ ఫైర్ బాక్సాఫీస్ ని సీజ్ చెయ్యడానికి రెడీ అయినట్లే. మరి డిసెంబర్ 22న సలార్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ముంబై ఇండియన్స్ కు రోహిత్ శర్మ ఫ్యాన్స్ షాక్..
టీమిండియా సారథి, రోహిత్ శర్మ అభిమానులు లక్షలాది మంది ముంబై ఇండియన్స్ పై ప్రతీకారం తీర్చుకునే పనిలో ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో ఇప్పటి వరకు 8 లక్షల మంది ఎమ్ఐ టీమ్ ను అన్ ఫాలో చేశారు. రోహిత్ శర్మను సారథ్య బాధ్యతల నుంచి తొలగించక ముందు ఇన్ స్టాలో ముంబైకి 13.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండేది.. కానీ ప్రస్తుతం 12.5 మిలియన్లకు ఆ సంఖ్య తగ్గింది. మరోవైపు ట్విటర్ లో కూడా దాదాపు 5 లక్షల మంది ముంబై ఇండియన్స్ ట్విట్టర్ అకౌంట్ ను అన్ ఫాలో చేశారు. ఈ రెండు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో కలిపి దాదాపు 13 లక్షల మంది ముంబై టీమ్ కి గట్టి షాకిచ్చారు. అయితే, ముంబై ఇండియన్స్ జట్టుకు హార్దిక్ పాండ్యాను తదుపరి ఐపీఎల్ సీజన్‌కు కెప్లెన్సీ బాధ్యతలు అప్పగించింది. దీంతో అభిమానులతో పాటు క్రికెట్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే, గత కొద్ది రోజుల క్రితమే హార్దిక్‌ను గుజరాత్ టైటాన్స్‌తో ముంబై టీమ్ ట్రేడ్ చేసుకుంది. 2013లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మ తీసుకున్నాడు. ఆ తర్వాత రోహిత్ తన టీమ్ కు ఐదు ఐపీఎల్ టైటిళ్లను అందించి రికార్డ్ సృష్టించాడు. ఇక, ,చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనితో కలిసి ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. అయితే, మహేంద్ర సింగ్ ధోనీ తన 14 సంవత్సరాల నాయకత్వంలో సీఎస్కేను ఐదుసార్లు విజేతగా నిలిపాడు.