విశాఖపట్నంకు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ అమరావతి రైతు పరిరక్షణ సమితి నేతలు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేసింది. దీంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థాయంలో అఫిడవిట్ దాఖలు చేసింది.
ఎంబీబీఎస్ విద్యార్థుల కోసం జాతీయ మెడికల్ కమిషన్ కొత్త బోధన ప్రణాళికకు సంబంధించిన మార్గ దర్శకాలను ఈ ఏడాది ఆగస్టు 1న జారీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలకు సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉందని.. న్యాయస్థానం తీర్పు ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర విద్యుత్, పునరుత్పాదక శక్తి శాఖ మంత్రి ఆర్.కే సింగ్ వెల్లడించారు.
విద్యుత్ ఛార్జీలు పెంచబోమని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు అని బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా కార్యదర్శి పార్థసారథి అన్నారు. కానీ అధికారంలోకి రాగానే మాటతప్పాడు అంటూ విమర్శలు గుప్పించారు.
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో చాలా మార్పులు ఉండబోతున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు వైవీ సుబ్బారెడ్డి.. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో వైసీపీ గెలిపించుకోవాలన్నదే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా తెలిపారు. కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితుల దృష్ట్యా మార్పులు, చేర్పులు చేస్తున్నాం.. గాజువాక నియోజకవర్గంలో కూడా సమన్వయకర్తని మార్పు చేయాలని పార్టీ ఆదేశించింది అన్నారు.
గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.. వైవీ సుబ్బారెడ్డితో సమావేశం అయ్యారు ఎమ్మెల్యే నాగిరెడ్డి, ఆయన కుమారుడు దేవన్ రెడ్డి.. హైకమాండ్ నిర్ణయం వెనుక కారణాలు వారికి చెప్పి బుజ్జగించారు వైవీ. దీంతో, రాజీనామా విషయంలో దేవన్ రెడ్డి వెనక్కి తగ్గారు.. అసలు తాను రాజీనామా చేయలేదని అంటున్నాడు.. ఇక, నేను గాని, నా కుమారులు గానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మకస్తులం.. సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా…