నంది అవార్డుల కోసం 115 దరఖాస్తులు వచ్చాయి.. అందులో 38 మందిని నంది అవార్డులకు ఎంపిక చేశారు.. నంది అవార్డుల ఎంపిక పారదర్శకంగా జరుగుతందన్నారు ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళీ.. ఈ నెల 23వ తేదీన నాటక రంగ నంది అవార్డులు అందిస్తున్నామని ఆయన వెల్లడించారు.
వైఎస్సార్ లా నేస్తం నిధులను విడుదల చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులను జమ చేశారు సీఎం.
వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్ తోనే నేను ఉన్నానని తెలిపారు.. 2014, 2019లో ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ నాకు అవకాశం ఇచ్చారని తెలిపారు. అయితే, నా వ్యక్తిగత కారణాలతో ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మంగళగిరి ఎమ్మెల్యే రాజీనామా చేశారు.. ఎమ్మెల్యే పదవితో పాటు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు..
కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేలా 3 ఏళ్ల పాటు ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ లా నేస్తం పథకం ద్వారా ఆర్థిక సాయం చేస్తోంది. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60,000 చొప్పున రెండు దఫాల్లో చెల్లిస్తూ, మూడేళ్లకు మొత్తం రూ.1,80,000 స్టైఫండ్ అందిస్తోంది. ఇందులో భాగంగా.. 2023-24 గాను రెండో విడత సాయాన్ని ఇవాళ విడుదల చేయబోతోంది. అర్హులైన యువ న్యాయవాదుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు సీఎం జగన్. తాడేపల్లి క్యాంపు…