AP High Court: ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ చేపట్టింది.. ఆ కేసులను సుమోటో తీసుకుని విచారణ జరిపింది హైకోర్టు.. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ నిర్ణీత సమయంలోగా పూర్తి అయ్యేలా ఆదేశాలు ఇస్తే బాగుంటుందని ఈ సందర్భంగా అభిప్రాయ పడింది హైకోర్టు.. లిఖిత పూర్వక వాదనలు తీసుకోవటం ద్వారా వాదనలు వీలైనంత త్వరగా ముగించవచ్చని పేర్కొంది.. కేసుల విచారణ పరిశీలనకు ప్రత్యేక కోర్టు అధికారిని ఏర్పాటు చేస్తామని పేర్కొంది హైకోర్టు.. కేసులు విచారణకు వేగవంతంగా లిస్ట్ అవటం కోసం పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, రిజిస్ట్రీలకు డైరెక్షన్ ఇస్తామని తెలిపింది హైకోర్టు .
Read Also: Republic Day 2024: రిపబ్లిక్ డే వేడుకల్లో ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల శకటాలకు దక్కని అవకాశం
ఇక, ఈ కేసు విచారణ సందర్భంగా ప్రజాప్రతినిధుల న్యాయస్థానంలో 78 కేసులు పెండింగ్ లో ఉన్నాయని హైకోర్టుకు తెలిపారు ఏజీ శ్రీరామ్.. కొన్ని కేసులు ట్రయిల్ దశలో ఉండగా, మరికొన్ని కేసులపై స్టే ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఏజీ.. మరికొందరిపై నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ అయ్యాయని హైకోర్టుకు తెలిపారు.. సమన్లు తొలుత ఇవ్వాలని స్పందన లేకపోతే.. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తామని పేర్కొంది హైకోర్టు.. మరోవైపు ప్రజాప్రతినిధులపై కేసుల వ్యవహారంలో పూర్తిస్థాయి మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలింది.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.