తనకు నియోజకవర్గం మార్పుపై ఎలాంటి అసంతృప్తి లేదన్నారు మంత్రి మేరుగ నాగార్జున.. వేమూరు నియోజకవర్గం నుంచి మూడు సార్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి బొమ్మపై గెలిచాను.. ఇప్పుడు సంతనూలపాడు నియోజకవర్గానికి ఇంఛార్జ్‌గా ఉన్నానని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.
రెండు రోజుల పాటు మిచౌంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది.. తుఫాన్‌తో నష్టపోయిన పంటలను, ఇతర ఆస్తుల నష్టాన్ని అంచనా వేయనున్నారు.. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో జరిగిన పంట, ఇతర ఆస్తుల నష్టాన్ని అంచనా వేయడానికి ఈ రోజు రాష్ట్రానికి కేంద్ర బృందం రాబోతుందని.. నేడు కృష్ణా, బాపట్ల జిల్లాల్లో, రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేస్తారని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రోజు బిజీగా గడపనున్నారు.. వరుస సమీక్షలతో పాటు.. ఈ రోజు సాయంత్రం తిరుపతి పర్యటనకు వెళ్లనున్నారు సీఎం జగన్.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నేడు ఆరోగ్యశ్రీపై సమీక్ష నిర్వహించనున్న ఆయన.. ఆ తర్వాత పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల జారీతో పాటు.. ధాన్యం సేకరణపై అధికారులకు కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు ఏపీ సీఎం.
ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమీషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
చంద్రబాబుకు ఏదో ఒక రోజు శిక్ష పడుతుందని కోర్టులు చెప్తున్నాయని ఎంపీ సురేష్ తెలిపారు. ఈ రాష్ట్రానికి లోకేష్ అవసరం ఏముంది?.. రాష్ట్ర సంపదను దోచుకున్నారు, అందువల్లే ప్రజలు పక్కన పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో వైసీపీ ఇంఛార్జ్ ల మార్పుపై టీడీపీ-జనసేన పార్టీలు చేసిన విమర్శలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. గెలుపు అవకాశాలను మెరుగుపరచడానికే మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ- జనసేన పార్టీలు ముందు వాళ్ళ ఇంటిని వాళ్ళు చక్కబెట్టుకోవాలి అని ఆయన చురకలంటించారు.
శ్రీశైల ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో 21 ట్రస్ట్ బోర్డ్ సమావేశం జరగింది. ఈ మీటింగ్ లో ట్రస్ట్ బోర్డ్ లో 30 ప్రతిపాదనలకు 28 ఆమోదం తెలపగా.. ఒకటి వాయిదా పడింది.. ఇంకో దాన్ని ట్రస్ట్ బోర్డు తిరస్కరించింది.
ఇప్పుడు మంగళగిరి ఎమ్మెల్యే.. గాజువాక ఇన్చార్జి కూడా వైసీపీకి రాజీనామా చేశారు.. ఈ సారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉండరు అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు.