ఏపీ సర్కార్ తెచ్చిన కార్డ్ 2.0 సాఫ్ట్వేర్ ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. డిజిటలైజేషన్లో భాగంగా రెవెన్యూ, మున్సిపల్ శాఖలతో అనుసంధానం చేయడం, ఈకేవైసీ కోసం చేసిన ఏర్పాటు.. కొత్త సమస్యలకు కారణమవుతోంది. రెగ్యులర్‌గా జరిగే సేవలు తప్ప మిగిలినవి అన్నీ ఆలస్యం అవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి.
మిచౌంగ్ తుఫాన్‌తో ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది? ఎంత ఆస్తి నష్టం జరిగింది? అన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏపీలో రెండు రోజుల పాటు పర్యటించనుంది సెంట్రల్ టీమ్. ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పంట నష్టాన్ని అంచనా వేస్తారు.
టీటీడీ నిధులను తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని అభివృద్ధి పనులకు మళ్లించడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో టెండర్లు ఫైనల్ చేసినా టీటీడీ నుంచి నిధులను మంజూరు చేయవద్దని టీటీడీ పాలకమండలిని ఆదేశించింది హైకోర్టు.
ఆడుదాం ఆంధ్రా క్రికెట్ మ్యాచ్‌లో మంత్రి గుడివాడ అమర్నాథ్ అద్భుత బ్యాటింగ్ చేశారు.. రెండు సిక్స్ లు, రెండు ఫోర్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డ ఆయన.. 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ చేశారు.
సీఎం వైఎస్ జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. గత నెల నవంబర్మూడో తేదీన జరిగిన కేబినెట్ భేటీలో కొన్ని కంపెనీలకు విచిత్రమైన ప్యాకేజీలు ప్రకటించారు. దుకాణం మూసేసే ముందు క్లియరెన్స్ సేల్స్ పెట్టినట్టు.. వైఎస్ జగన్ కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల పేరుతో జగన్ క్లియరెన్స్ సేల్స్ మొదలు పెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు..