YV SUbba Reddy: వైసీపీ టార్గెట్ అదే.. అందుకే ఈ మార్పులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YV SUbba Reddy: వైసీపీలో సీట్ల మార్పులు చేర్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి.. విశాఖ చేరుకున్న ఆయనకు ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికారు పార్టీ నేతలు, కార్యకర్తలు.. ఇక, ఎయిర్‌పోర్ట్ నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. మేం 175కి 175 టార్గెట్ పెట్టుకున్నాం.. దానిలో భాగంగానే ఈ మార్పులు జరుగుతున్నాయని తెలిపారు.. అయితే, వైసీపీలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా కూడా రాజీనామా చేసి వెళ్తున్నారంటే దానికి వారే సమాధానం చెప్పాలన్నారు. ఎంతమంది నాయకులు ఉన్నా బీసీలకు న్యాయం చేయాలని పట్టుబట్టి వంశీకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాం.. కానీ, ఆయన పార్టీని వీడారు.. అయితే, పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా మాకు ఏమీ ఇబ్బంది లేదు.. ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Read Also: Medak Student: విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్.. అర్ధనగ్నంగా హంగామా..!
Also Read
ఇక, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మా నాయకుడు వైఎస్ జగన్‌కు తిరుగులేదన్నారు వైవీ సుబ్బారెడ్డి.. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి చూసి మళ్లీ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అయితే, పార్టీలో మార్పులు చేర్పులపై స్పందిస్తూ.. ఎక్కడైతే పార్టీ పరిస్థితి బాగోలేదు అక్క ఇంఛార్జీలను మార్చామని వల్లడించారు. మేండ 175 స్థానాలకి 175లో గెలుపే టార్గెట్ పెట్టుకున్నాం.. దానిలో భాగంగానే ఈ మార్పులు జరుగుతున్నాయన్నారు. ఎక్కడ అయితే అభ్యర్థులను మారుస్తున్నామో.. అక్కడ ముందు పనిచేసిన నాయకులు సహకరించాలని జగన్మోహన్ రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. ఇక, జనవరి నెలకి బస్సుయాత్ర ముగింపు దిశగా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కోర్టు పరిధిలో ఉన్న ఇబ్బందులు వల్లే రాజధాని మార్చడం ఆలస్యం అయింది.. తప్పకుండా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. విశాఖ నుంచి పాలన సాగిస్తారని తెలిపారు వైవీ సుబ్బారెడ్డి.
తాజావార్తలు
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!