YS Sharmila: కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరికపై ఏకాభిప్రాయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Sharmila: ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి పుంజుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది పార్టీ అధిష్టానం.. రాష్ట్ర నేతలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి.. పార్టీ పునర్‌నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే.. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొని.. నేతలకు దిశానిర్ధేశం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన కేంద్ర మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ ఆహ్వానితులు పళ్లం రాజు.. సమావేశంలో జరిగిన అంశాలను ఎన్టీవీతో పంచుకున్నారు.
Read Also: Salaar: ఆరు రోజుల్లో 70% రికవరీ… అయినా అప్సెట్ లో ఉన్న ఫ్యాన్స్?
Also Read
ఇక, వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ పార్టీలో చేరతారని.. ఆమెకే పార్టీ పగ్గాలు ఇస్తారనే చర్చ సాగుతోన్న నేపథ్యంలో.. పళ్లం రాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరికకి సంబంధించి ఏఐసీసీ పెద్దలు మా అభిప్రాయం అడిగారని తెలిపారు.. అయితే, షర్మిల పార్టీలో చేరితే కాంగ్రెస్ కి ఉపయోగం ఉంటుందని అందరం ఏకాభిప్రాయం చెప్పామని వెల్లడించారు. కానీ, కాంగ్రెస్ పార్టీలో ఆమె స్థానంపై ఎటువంటి చర్చ జరగలేదన్నారు పళ్లంరాజు.. మరోవైపు.. రాష్ట్రంలో లైక్ మైండెడ్ పార్టీలతో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకుంటుందన్నారు. రాష్ట్రానికి సమయం కేటాయిస్తానని రాహుల్ గాంధీ చెప్పారని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలతో పోటీపడి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పెంచే విధంగా పనిచేయాలని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సూచించారని చెప్పుకొచ్చారు. ఇక, పాత నేతలు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తాం అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన హామీలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అన్నారు కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!