మా టార్గెట్ 175 సీట్లు.. జగనన్న మా టీం కెప్టెన్ అని స్పష్టం చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్.. నియోజకవర్గ మార్పుపై స్పందించిన ఆయన.. నియోజకవర్గ మార్పుపై పార్టీ నిర్ణయమే శిరోధార్యం అన్నారు.
175 నియోజకవర్గాల్లో.. సర్వేలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రక్షాళన చేపట్టారు. గెలిచే అవకాశం లేని నేతలను పక్కన పెట్టాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. వారి స్థానాల్లో కొత్త అభ్యర్థులను రంగులో దింపుతున్నారు. 11 నియోజకవర్గాల్లో కొత్త వారికి బాధ్యతలు అప్పగించింది. ఇందులో 5 ఎస్సీ రిజర్వర్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. మొదటి ఫేజ్‌లో నలుగురికి స్థాన చలనం కల్పించారు. మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు కొండేపి, మేకతోటి సుచరితకు తాడికొండ, మేరుగ నాగార్జునకు సంతనూతలపాడు బాధ్యతలు అప్పగించారు. మరో మంత్రి…
ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. అయితే, పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది విచారణ.. ఈ రోజు మరోసారి విచారణకు రానుంది చంద్రబాబు పిటిషన్
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో.. నేటి నుంచి సమ్మె చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అంగన్వాడీలకు సంబంధించిన మూడు ప్రధాన సంఘాలు.. మంగళవారం నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించాయి.
తిరుపతిలోని సుబ్బారెడ్డి నగర్లో కిషోర్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.. ఈ హత్య ఎందుకు? జరిగింది? ఎవరి పని కావొచ్చు అనేదానిపై పోలీసుల చెబుతున్న వివరాల ప్రకారం.. తనకు పరిచయం ఉన్న యువతిన వేధిస్తున్న వారికి వార్నింగ్ ఇచ్చాడట కిషోర్.. మరోసారి ఆ యువతి జోలికి రావొద్దని హెచ్చరించాడట.. దీంతో, కిషోర్‌కు ఆ పోకిరీల మధ్య చిన్నపాటి వివాదం చోటు చేసుకుఒంది.. అది కాస్తా ఘర్షణకు దారితీసింది.. ఆ తర్వాత కత్తులతో కిషోర్‌పై దాడిచేసి చంపేశారు…
రిటైల్‌లో ఒక్కో గుడ్డు ధర రూ.6.50 నుంచి రూ.7కు పెరిగింది.. రిటైల్‌లో ఒక్క గుడ్డును ఏడు రూపాయలకు విక్రయిస్తున్నారు వ్యాపారులు.. ఇక, టోకుగా 100 గుడ్లు ధర 580 రూపాయలుగా ఉంది.. అంటే హోల్ సెల్లో ఒక గుడ్డు ధర రూ.5.80 పలుకుతుండగా.. అదే రిటైల్‌కి వచ్చే సరికి సరాసరి రూ.1.20 పెంచేసి.. రూ.7కు విక్రయాలు సాగిస్తున్నారు.
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.. మంగళగిరి వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది.. వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ రోజు.. ఎమ్మెల్యే పదవితో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే, ఎమ్మెల్యే ఆర్కే రాజీనామాతో తాడేపల్లిలో రాజీనామాలు మొదలయ్యాయి.