Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Ap Cm Ys Jagan Video Conference With District Collectors

CM YS Jagan: కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌.. 2 నెలల్లో 4 ప్రధానమైన కార్యక్రమాలు

Published Date :December 28, 2023 , 2:44 pm
By Sudhakar Ravula
CM YS Jagan: కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌.. 2 నెలల్లో 4 ప్రధానమైన కార్యక్రమాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM YS Jagan: జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. వారికి దిశానిర్దేశం చేశారు.. వైయస్సార్‌ పెన్షన్‌ కానుక, వైయస్సార్‌ ఆసరా, వైయస్సార్‌ చేయూత, అంబేద్కర్‌ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లతో చర్చించారు సీఎం.. జనవరిలో 3, ఫిబ్రవరిలో 1, మొత్తంగా నాలుగు ప్రధానమైన కార్యక్రమాలు చేస్తున్నాం.. ఎక్కడా పొరపాట్లు లేకుండా చూసుకోవాలి.. ప్రతి కార్యక్రమానికి ప్రీలాంచ్‌, లాంచ్‌, పోస్ట్‌లాంచ్‌ కార్యక్రమాలు ఉంటాయి.. అవి సక్రమంగా నడిచేలా కలెక్టర్లు షెడ్యూల్‌ చేసుకోవాలి.. జనవరి 1వ తేదీ నుంచి వైయస్సార్‌ పెన్షన్‌ కానుక రూ.3వేలకు పెంపు.. రూ.3 వేలకు పెన్షన్‌ పెంచుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నాం.. విశ్వసనీయతకు ఈ ప్రభుత్వం మారు పేరు అని రుజువు చేస్తున్నాం.. జనవరి 1 నుంచి 8వ తేదీ వరకూ పెన్షన్ల పెంపు కార్యక్రమం ఉంటుంది.. మన ప్రభుత్వం రాకముందు ఎన్నికలకు 2 నెలల ముందు వరకూ పెన్షన్‌ కేవలం రూ.1000 మాత్రమే ఇచ్చేవారు.. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2,250 లు చేశాం.. ఇప్పుడు రూ.3 వేల వరకూ పెంచుకుంటూ వచ్చాం.. నెలకు 400 కోట్ల మాత్రమే గత ప్రభుత్వంలో సగటున పెన్షన్లకోసం ఖర్చు చేసేవారు.. ఇప్పుడు నెలకు రూ.1950 కోట్ల ఖర్చు చేస్తున్నాం.. మన రాకముందు పెన్షన్ల సంఖ్య 39 లక్షలు, ఇప్పుడు 66 లక్షలు అన్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

ప్రతి అడుగులోనూ కూడా ఏ లబ్ధిదారు మిగిలిపోకూడదు, ప్రతి ఒక్కరికీ కూడా మంచి జరగాలి, ఎవ్వరూ కూడా ఇబ్బందులు పడకూడదని ఎప్పుడూ లేని విధంగా వాలంటీర్ – సచివాలయ వ్యవస్థను గ్రామస్థాయిలో తీసుకు వచ్చాం అన్నారు సీఎం జగన్‌.. ఆదివారమైనా, పండుగైనా సరే ఒకటో తారుఖీన చిక్కటి చిరునవ్వుతో పెన్షన్‌ను ఇంటివద్దే ఇచ్చే పరిస్థితిని, మార్పును తీసుకురాగలిగాం.. ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఈ మార్పును తీసుకురాగలిగాం.. ఈ మార్పును ఎలా తీసుకు రాగలిగామన్నది ప్రతి గడపకూ తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. రెండో కార్యక్రమం జనవరి 19న అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం.. జనవరి 23 నుంచి 31 ఆసరా కార్యక్రమం జరుగుతుంది. నాలుగో కార్యక్రమం వైయస్సార్‌ చేయూత కార్యక్రమం ఫిబ్రవరి 5 నుంచి 14వరకూ కొనసాగుతుంది.. ప్రభుత్వం చాలా ప్రతిష్ట్మాత్మకంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.. అర్హత ఉండీ ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయిన సందర్భాల్లో వారికి పథకాలు వర్తింపు చేసే బై యాన్యువల్‌ కార్యక్రమం జనవరి 5న జరుగుతుంది.. ఈ కార్యక్రమం జరిగే లోపే దాదాపు 1.7 లక్షల పెన్షన్లు ఒకటో తారీఖు నుంచే ఇస్తారు.. 66,34,742మందికి రూ.1968 కోట్లకుపైగా పెన్షన్ల రూపంలో అందుతాయి అన్నారు.

మన ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచింది అన్నారు సీఎం జగన్‌.. ఈ సందేశం ప్రతి ఒక్కరికీ చేరాలి.. పెన్షన్ల పెంపు కార్యక్రమంలో భాగంగా నేను 3వ తారీఖున కాకినాడలో పాల్గొంటున్నాను.. అవ్వాతాతలు వేచిచూసే పరిస్థితి లేకుండా 1వ తారీఖునే ప్రారంభం అవుతుంది.. ప్రజా ప్రతినిధులు అందరూ కూడా పెన్షన్‌ కానుక కార్యక్రమంలో భాగస్వాములు కావాలి.. ఎమ్మెల్యేలు ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి.. దీనిపె షెడ్యూలు చేసుకోవాలి అన్నారు. 8 రోజులపాటు పెంచిన పెన్షన్లతో పెన్షన్‌ కానుక కార్యక్రమం జరుగుతుంది.. పెన్షన్‌తోపాటు నా తరఫున లేఖను కూడా లబ్ధిదారులకు అందించాలి.. అలాగే నేను ఇచ్చే వీడియో సందేశం కూడా లబ్ధిదారులకు చేరవేయాలి, ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు, ఉత్సహవంతులు, లైక్‌ మైండ్స్‌.. ఈకార్యక్రమంలో పాల్గొనేలా చూడాలి అన్నారు. చరిత్రలో ఎప్పుడూ కూడా అవ్వాతాతలను ఈ విధంగా పట్టించుకున్న ప్రభుత్వం లేదు.. వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి వద్దకే పెన్షన్‌ అందిస్తున్నాం.. దీనికోసం వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను నెలకొల్పాం.. దేశంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్‌ డబ్బు ఇవ్వలేదన్నారు.

మనం చెప్పిన మాటను నెరవేర్చాలా మన ప్రభుత్వం కృతనిశ్చయంతో అడుగులు వేసిందని స్పష్టం చేశారు సీఎం జగన్‌.. ఇచ్చిన హామీని మనసా వాచా అమలు చేయడానికి ఎంతగా కష్టపడ్డామో అందరికీ తెలిసిందే.. ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రతి లబ్ధిదారులకు తెలియాలి.. ఏడాదికి దాదాపు రూ.23 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అంకిత భావంతో అవ్వాతాతలకు అండగా నిలిచాం.. మన ప్రభుత్వం రాకముందు పొదుపు సంఘాలు పూర్తిగా కుదేలైపోయాయి.. ఏ గ్రేడ్‌, బి గ్రేడ్‌ సంఘాలు మరింతగా పడిపోయాయి.. 18 శాతం పైచిలుకు అక్కౌంట్లన్నీకూడా అవుట్‌ స్టాండింగ్‌, ఎన్‌పీఏల స్థాయిలోకి వెళ్లిపోయాయి.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది.. మనం వారికి చేయూత నిచ్చి ఆసరా, సున్నావడ్డీ, చేయూత, అమ్మ ఒడి పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం..మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారితను సాధించగలిగాం. క్రమం తప్పకుండా ప్రతి ఏటా లబ్ధిదారులకు అందించగలిగాం.. అందుకనే ఈరోజు పొదుపు సంఘాల్లో ఎన్‌పీఏలు 0.౩శాతానికి చేరాయి.. అక్క చెల్లెమ్మలకు ఇంతగా తోడు ఉంటే ప్రభుత్వం మనది.. ఆసరాకోసమే రూ.25,570 కోట్లు ఖర్చు చేశాం.. మూడు విడతలుగా ఇప్పటికే రూ.19,,195 కోట్లు ఇచ్చాం.. చివరి విడతగా 6,394 కోట్లు ఇస్తున్నాం.. జనవరి 23 నుంచి 31వ తారీఖు వరకూ కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది.. ఈ కార్యక్రమం ద్వారా 78.94 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారని తెలిపారు.

మహిళల్లో సుస్థర జీవనోపాథి కల్పించాలన్నదే ఆసరా, చేయూత పథకాల ఉద్దేశం అన్నారు సీఎం జగన్‌.. దీనికోసం అనేక మల్టీ నేషనల్‌, ప్రముఖ కంపెనీలతో టై అప్‌ చేయించాం. స్వయం ఉపాధి పథకాల ద్వారా వారి జీవితాల్లో వెలుగులు చూడగలుగుతాం. ప్రీలాంచ్‌, లాంచ్‌, పోస్ట్ లాంచ్‌ కార్యక్రమాల్లో మహిళలు, మహిళా సంఘాల్లో అవగాహన కల్పించాలి. మహిళా సంఘాలు తీర్మానాలు చేసుకుంటే ఆసరా కింద ఇచ్చే డబ్బు వారి వ్యక్తిగత ఖాతాల్లోకి వెళ్తుందన్నారు. పెన్షన్‌ కానుక, ఆసరా, చేయూత లబ్ధిదారుల విజయగాధలను వీడియోల రూపంలో పంపాలి.. పంపిన వాటిలో అత్యుత్తమమైన వాటికి ఈ బహుమతులు ఇస్తాం.. ఇవి మరికొందరిలో స్ఫూర్తిని పెంచుతాయి.. ఏ రకంగా ఈపథకాలు, కార్యక్రమాలు వారి జీవితాలను మార్చాయో ఈ వీడియోల ద్వారా తీసుకోవాలి.. ఈ పథకాల ద్వారా మహిళల్లో వచ్చిన మార్పులపై ఈ వీడియోల ద్వారా తీసుకోవాలి.. సచివాలయాల్లో రూ.10వేలు, మండల స్థాయిలో రూ.15వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20వేలు, జిల్లా స్థాయిలో రూ.25వేలు ఇస్తాం అన్నారు. ఫిబ్రవరి 15-16 తేదీల్లోనే ఉత్తమ సేవలు అందించినందుకు వాలంటీర్లకు సేవామిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులు.. వాటితోపాటు లబ్ధిదారులపై ఉత్తమ వీడియోలు పంపినవారికి అవార్డులు ఇస్తాం అన్నారు. కార్యక్రమాలన్నీ ఉత్సవ వాతావరణంలో జరగాలి.. మహిళా సంఘాల కార్యకలాపాలు తెలియజేసే స్టాల్స్‌ను పెట్టాలి.. ఫిబ్రవరి 5 నుంచి 14వరకూ వైయస్సార్‌ చేయూత కార్యక్రమం ఉంటుంది.. ఇప్పటివరకూ రూ.14,129 కోట్లు ఇచ్చాం.. తుది విడత ద్వారా మొత్తంగా రూ.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో 45 ఏళ్ల పైబడ్డ ఉన్న మహిళలకు ఏడాదికి రూ.18,750లు ఇచ్చాం.. యూనిక్‌ లబ్ధిదారులు 31,23,466 మంది ఉన్నారు.. ఈ పథకం వారి జీవితాల్లో ఏరకంగా మార్పులు తీసుకు వచ్చిందో తెలియజెప్పాలి.. చివరి విడతద్వారా 26,39,703 మంది లబ్ధి పొందుతున్నారు.. మహిళల జీవనోపాథి మార్గాలపై వారిలో మరింత అవగాహన కల్పించి, వారికున్న అవకాశాలనుకూడా వివరించాలి అన్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

ఇక, జనవరి 19 విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ప్రారంభిస్తున్నాం అన్నారు సీఎం జగన్‌.. రూ.404 కోట్లతో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం.. సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా ఈ విగ్రహాన్ని నిర్మిస్తున్నాం. సచివాలయం స్థాయి నుంచి రాష్ట్రస్థాయివరకూ సామాజిక న్యాయ నినాదం వినిపించాలి.. ప్రతి సచివాలయం పరిధిలోకూడా సమావేశాలు పెట్టండి.. ప్రతి సచివాలయం నుంచి 5 మంది అంబేద్కర్‌ విగ్రహం ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలి.. ప్రతి మండల కేంద్రం నుంచి ప్రత్యేకమైన బస్సులు నడుపుతాం.. సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా అంబేద్కర్‌ విగ్రహం నడుస్తుంది.. గ్రామ స్థాయిలో గొప్ప వ్యవస్థను తీసుకు వచ్చాం.. గ్రామ స్వరాజ్యం తీసుకు వచ్చాం.. ఇదొక గొప్ప మార్పు.. ఈ మార్పునకు ప్రతిరూపంగా అంబేద్కర్‌ విగ్రహం నిలుస్తుందన్నారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • CM YS Jagan
  • District Collectors
  • video conference

తాజావార్తలు

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • KKR vs LSG: 27 బంతుల్లో 7 సిక్సర్లు.. ఓటమి అంచు నుంచి లక్నోను గెలిపించిన ముకుల్ చౌదరి ఎవరు!

  • Astrology: ఏప్రిల్‌ 10, శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions