Madvi Hidma: మోస్ట్ వాంటెండ్ మావోయిస్ట్ మడావి హిడ్మా హతమయ్యాడు. నవంబర్ 30లోపు హిడ్మాను హతమారుస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గతంతో శపథం చేశారు. గడువుకు 12 రోజుల ముందే హిడ్మా ఎన్కౌంటర్ లో హతమయ్యాడు. మంగళవారం ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ ట్రై-జంక్షన్లోని దట్టమైన పుల్లగండి అడవులలో జరిగిన భీకర ఎన్కౌంటర్లలో హిడ్మాను భద్రతా దళాలు హతమార్చాయి.
టీటీడీ కీలక నిర్ణయం.. ఇక, ఆ భక్తుల సౌకర్యాల్లో కోత..! అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడు తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా ఏటా 1600 కోట్లు కానుకులు అందుతుండగా.. టన్ను వరకు బంగారం, పది టన్నుల వరకు వెండి కానుకల రూపంలో వస్తోంది. ఇక ఆస్థులు కూడా పెద్ద ఎత్తునే స్వామివారికి సమర్పిస్తారు. ఇలా ఇప్పటి వరకు శ్రీవారికి 10 రాష్ర్టాలలో 80 వేల కోట్ల రూపాయల ఆస్థులు ఉన్నాయి. మరో వైపు హిందు ధర్మ ప్రచారంలో భాగంగా…
Karumuri Venkata Reddy Arrest: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. ఈ రోజు ఉదయం హైదరాబాద్లోని వెంకట రెడ్డి ఇంటికి వెళ్లిన తాడిపత్రి పోలీసులు.. ఆయన్ని అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు.. అయితే, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేయడం ఏంటి అంటూ వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. పోలీసుల తీరుపై వెంకటరెడ్డి భార్య తీవ్ర ఆవేదన…
Maoists in Vijayawada: ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోవడం వద్ద మావోయిస్టుల ఎన్కౌంటర్ జరిగింది.. ఈ భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత హిడ్మాతో పాటు అతని భార్య హేమ మరో నలుగురు మావోయిస్టు మృతి చెందినట్టు అధికారులు చెబుతున్నారు.. హిడ్మాపై కోటి రూపాయలకు పైగా రికార్డు ఉండగా.. ఆయన భార్య హేమపై రూ.50 లక్షల పైగా రివార్డు ఉంది.. అయితే, మరోవైపు విజయవాడలో మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టించాయి.. నగరంలోని కానూరు ప్రాంతంలో మావోయిస్టుల…
TTD Parakamani Case: టీటీడీ పరకామణి చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణకు హాజరైన సమయంలో CVSO సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం హైకోర్టుకు తెలిసినట్లు పేర్కొంది.. ఇదే సమయంలో కీలక ఆదేశాలు జారీ చేశారు హైకోర్టు… ఈ కేసులో నిందితుడు రవికుమార్తో పాటు సాక్ష్యులకు భద్రత కల్పించాలని స్పష్టం చేసింది.. పరకామణి చోరీ కేసు విచారణ ముగిసే వరకు సాక్ష్యులకు ప్రొటెక్షన్ ఇవ్వాలని ఏపీ సీఐడీ…
Maoist Key Leader Hidma Encounter: మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్లో ఇప్పటికే ఎంతో మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.. కీలక నేతలు సైతం హతం అయ్యారు.. మరోవైపు పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు కూడా.. ఈ సమయంలో కీలక నేతగా ఉన్న హిడ్మా ఎక్కడ? హిడ్మా కూడా లొంగిపోతారా? అనే చర్చ జరిగింది.. అయితే, అల్లూరి సీతారామ రాజు జిల్లా రంపచోడవరం దగ్గర జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత…
వణికిస్తున్న ‘చలి పులి’.. 5 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. తెలుగు రాష్ట్రాలపై చలి పులి పంజా విసురుతోంది.. ముఖ్యంగా ఏజెన్సీలో మాత్రం పరిస్థితి మరింత దారుణంగా ఉంది.. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీని వణికిస్తోంది చలి.. జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో తీవ్ర చలి అలుముకుంది.. ఈ సీజన్లో తొలిసారిగా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జి.మాడుగుల, మినుములూరు ప్రాంతాల్లో 5 డిగ్రీలు నమోదు కాగా, పాడేరు, అరకు, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.…
Forest Beat Officer Scam: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో అటవీ శాఖ ఉద్యోగాల పేరుతో భారీ మోసం బయటపడింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఇప్పిస్తామని నమ్మించి, ఇద్దరి నుంచి 10 లక్షల రూపాయలు వసూలు చేయాలని చూస్తున్న ఇద్దరు వ్యక్తులను రాజమండ్రి వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉప్పాడ కొత్తపల్లి నివాసి నవంత్, ఆలమూరు చెందిన రాజ్కుమార్.. ఇద్దరూ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వేళ, ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న వ్యక్తి సూచనతో జల్లూరు…
Tirupati Crime: మైనర్ బాలికను అపహరించి అత్యాచారం చేసిన కేసులో ఇద్దరు యువకులు, వారికి సహకరించిన యువతిని అరెస్టు చేశారు ఈస్ట్ పోలిసులు. చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం సమీపంలోని గాంధీపురానికి చెందిన రోహిణి.. తిరుపతికి చెందిన బాలికకు ఈనెల 9న రాత్రి ఫోన్ చేసి పీలేరు దగ్గర జలపాతాలకు తీసుకెళ్తానని రెండుజతల బట్టలు తీసుకుని తిరుపతిలోని మున్సి పల్ పార్కు వద్దకు రమ్మని పిలిచింది. నమ్మివచ్చిన బాలికను చంద్రగిరిలోని తన ఇంటికి తీసుకెళ్లి.. మరుసటి రోజు ఉదయం…
* శ్రీ సత్యసాయి: సత్య సాయి బాబా శతజయంతి వేడుకలు.. నేడు పుట్టపర్తికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రులు నారా లోకేష్, అనగాని, పయ్యావుల కేశవ్, అనిత, సత్యకుమార్ .. వీఐపీల తాకిడితో పుట్టపర్తిలో భారీ భద్రత ఏర్పాటు * తిరుమల: ఇవాళ టిటిడి పాలకమండలి సమావేశం.. వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్లు జారీ విధానంపై నిర్ణయం తీసుకోనున్న…