యువతకు, పిల్లలకు స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ కంటే హనుమంతుడు చాలా బలవంతుడు.. ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడు.. కృష్ణుడి మహిమలు, శివుని మహత్యం గురించి చెప్పాలని సీఎం చంద్రబాబు అన్నారు.
TTD Srivani Tickets: తిరుమలలో వరుస సెలవులు రావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. శ్రీనివాసుడి దర్శనానికి సుమారు 30 గంటలకు పైగా సమయం పడుతుండటంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆఫ్ లైన్ విధానంలో జారీ చేసే శ్రీవాణి దర్శన టిక్కెట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
Tirumala: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆఫ్ లైన్ విధానంలో టిక్కెట్ల జారీకి మంగళం పాడే యోచనలో టీటీడీ ఉన్నట్లు తెలుస్తుంది. ఆఫ్ లైన్ విధానంలో తిరుపతిలో సర్వదర్శనం భక్తులకు, నడకదారి భక్తులకు దర్శన టిక్కెట్లను అధికారులు జారీ చేస్తున్నారు.
Nandyal Tragedy: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం బత్తలూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్వాలిస్ వాహనం రోడ్డు డివైడర్ ను కొట్టి CGR ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది.
Medical Colleges through PPP Mode: ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య రంగంలో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) విధానాన్ని మరింత విస్తృతంగా వినియోగించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్‌కు లేఖ ద్వారా సూచించారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతుల విస్తరణ, సేవల నాణ్యత పెంపు కోసం పీపీపీ మోడల్‌ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. PPP ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం…
చట్టపరంగా న్యూ ఇయర్‌ను ఎంజాయ్ చేయండి.. హద్దు మీరితే సెంట్రల్ జైలే గతి.. సీపీ మాస్ వార్నింగ్.. న్యూ ఇయర్ వేడుకలకు అంతా సిద్ధం అవుతున్నారు.. 2025కి బైబై చెప్పేసి.. 2026కి గ్రాండ్‌గా వెల్కం చెప్పేందుకు రెడీ అవుతున్నారు.. అయితే, చట్టపరంగా న్యూ ఇయర్ ను ఎంజాయ్ చేయండి, హద్దు మీరితే విశాఖ సెంట్రల్ జైలే గతి అని మాస్ వార్నింగ్ ఇచ్చారు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి.. న్యూ ఇయర్ ముసుగులో మత్తు సరఫరా…
విశాఖలోని పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భర్త రెచ్చిపోయాడు.. భార్య, అత్తపై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచాడు. పెందుర్తి దగ్గువాని పాలెం కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. భార్య కనకమహాలక్ష్మి, అత్త లక్ష్మీపై సుత్తితో తలపై కొట్టి దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు అప్పారావు. ఇంట్లో అరుపులు కేకలు విని అడ్డుకోవడానికి వెళ్లిన వారిపై కూడా దాడికి పాల్పడ్డాడు అప్పారావు.. తీవ్ర గాయాలైన కనకమహాలక్ష్మి, లక్ష్మీలను పెందుర్తి ప్రభుత్వ హాస్పిటల్ కి స్థానికులు తరలించారు. విషయం…