* ఇవాళ్టి నుంచి భారత్, న్యూజిలాండ్ టీ-20 సిరీస్.. ఇవాళ రాత్రి 7 గంటలకు నాగ్‌పూర్ వేదికగా తొలి మ్యాచ్.. భారత్-న్యూజిలాండ్ మధ్య 5 మ్యాచ్‌ల టీ-20 సిరీస్
* నేటి నుంచి జేఈఈ మెయిన్స్.. రికార్డు స్థాయిలో 14.50 లక్షల మంది దరఖాస్తు..
* మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు.. ఇవాళ మండమెలిగే పండుగకు ఏర్పాట్లు.. మేడారం జాతరకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఈ నెల 25 నుంచి 31 వరకు ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు.. 50 శాతం అదనపు ఛార్జీలతో మేడారానికి 3,495 బస్సులు
* నేడు కృష్ణా జిల్లా పెడనలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన.. మధ్యాహ్నం 1.50 గంటలకు పెడన నియోజకవర్గంలోని పెద చందాల గ్రామానికి పవన్.. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు చందు వీర వెంకట వసంత రాయల కుటుంబాన్ని పరామర్శించనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
* భద్రాద్రి: నేడు సింగరేణి కార్యాలయం ముందు ధర్నాకు బీఆర్ఎస్ పిలుపు.. సింగరేణి కోల్ కాంట్రాక్ట్ లో ముఖ్యమంత్రి బావమరిది పాత్ర పై విచారణ జరుపాలని డిమాండ్
* నేడు ఖమ్మం లో ఆర్ వెంకటేశ్వర స్వామి కళ్యాణం లో పాల్గొనున్న చిన్న జీయర్ స్వామి
* ఆదిలాబాద్: నేడు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన.. సాయంత్రం నాగోబాను దర్శించుకోనున్న డిప్యూటీ సీఎం.. అంతకంటే ముందు దంతనాపల్లి, పులి మడుగు లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేయనున్న భట్టి.. డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పర్యటన
* జగిత్యాల జిల్లా : నేడు ధర్మపురిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు పర్యటన.. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్లను దర్శించుకొనున్న డిప్యూటీ సీఎం.. పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న భట్టి.. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం
* నిర్మల్: నేటి నుంచి మూడు రోజుల పాటు బాసరలో వసంత పంచమి ఉత్సవాలు. ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు. 23 న వసంత పంచమి సందర్భంగా భారీగా తరలి రానున్న భక్తులు. ఆరోజు తెల్లవారు జామునుంచే అక్షర శ్రీకార పూజలు.
* తిరుపతి: నేడు చంద్రగిరి రంగంపేటలో జల్లి కట్టు పోటీలు..