విశాఖపట్నం పర్యటనలో ఉన్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్... గత ప్రభుత్వ హయాంలో రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ను పరిశీలించారు.. జనసేనకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి రుషికొండ ప్యాలెస్ను తిలకించారు పవన్.. ప్రకృతితో పెట్టుకుంటే ఉన్నది పోద్ది" అంటారు.. సంవత్సరానికి 7 కోట్లు రాష్ట్రానికి ఆదాయం వచ్చే రుషికొండపై 1 కోటి రూపాయలు కేవలం కరెంటుకే వెచ్చించే స్థితికి తెచ్చారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు..
ప్రేమ జంటలు టార్గెట్గా వసూళ్లు..# ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు..# నగర శివారులో ఏకాంతంగా కనిపించే ప్రేమ జంటలే టార్గెట్..# బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు, బంగారం దోపిడీ..
సుగాలి ప్రీతి కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తాను, డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించగానే నేను తీసుకున్న తొలి నిర్ణయం సుగాలి ప్రీతి కేసు అని గుర్తుచేసుకున్నారు.. ఆ పాపకి న్యాయం జరగాలి ఏమీ ఏమీ జరిగింది అని అడిగా? సుగాలి ప్రీతి కేసు త్వరిత పరిష్కారం కోసం నేను సిఫారసు చేశాను.. సీఐడీ చీఫ్, డీఐజీ, హోం మంత్రికి వెంటనే ఆదేశాలు ఇచ్చాను..
విజయనగరం జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.. దీంతో, పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలో సంతకాల బ్రిడ్జి వద్ద పట్టాలు తప్పింది గూడ్స్ రైలు.. గూడ్స్ నుంచి మూడు వ్యాగన్లు విడిపోయాయి..
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంలో కీలక వ్యక్తులంతా విశాఖపట్నంలోనే పర్యటిస్తున్నారు.. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విశాఖలో ఉన్నారు.. రెండో రోజు సేనతో సేనాని కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసిన ముఖ్య కార్యకర్తలతో ఇవాళ ఉదయం 10 గంటలకు పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు.. ఇక, మధ్యాహ్నం పార్టీ అనుబంధ విభాగాలతో సమావేశంకానున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
* నేడు జపాన్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. సెమీ కండక్టర్లతో ప్రత్యేక సమావేశంలో పాల్గొననున్న మోడీ * నేడు ఉదయం 8.30 గంటల వరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగామ, కొత్తగూడెం జిల్లాల్లో…
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం కేంద్రంలో ఉన్న గాంధీనగర్ కు చెందిన ఎం.నాగజ్యోతి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహంచిన మెగా డీఎస్సీలో మంచి మార్కులు సాధించింది.. 74.40 మార్కులు రాబట్టింది.. మంచి మార్కులతో టీచర్ ఉద్యోగానికి అర్హురాలు అయినప్పటికీ.. క్యాన్సర్తో బాధపడుతోన్న ఆమె.. విశాఖలోని ఓ ఆసుపత్రిలో మృతి చెందింది.
విశాఖపట్నం మధురవాడలోని శ్రీ తనుష్ పాఠశాలలో అమానుష ఘటన చోటుచేసుకుంది... సదరు పాఠశాలలో 8వ తరగతి చదువుతోన్న విద్యార్థి చేయి విరగొట్టాడు ఉపాధ్యాయుడు.. ఇనుప బల్ల కేసి చితకబాది.. ఆపై పిడుగులు గుద్ధి చేయి విరగగొట్టాడు అని విద్యార్థి తల్లితండ్రులు చెబుతున్నారు.. ఈ ఘటనలో మూడు చోట్ల బాలుడి ఎముకలు విరిగాయి.. దీంతో, శస్త్ర చికిత్స కోసం విద్యార్థిని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు.. విద్యార్థిపై దాడికి కారణమైన సోషల్ మాస్టర్ మోహన్.. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు..