కూటమి లో ఐక్యత పూర్తి స్థాయిలో ఉందని చెప్పడం కోసమే అనంతపురం సభ ఏర్పాటు జరిగిందా...కూటమి నేతల్లో పై స్థాయిలో...సఖ్యత కింద స్థాయి వరకు ఉండాలనే సంకేతాలు ఇచ్చారా...తాజా పరిణామాలు చూస్తే ఇలాగే ఉన్నాయి....కూటమి ఐక్యత కొనసాగిస్తూ....ముందుకు వెళ్లడమే ప్రధాన ఎజెండా గా సభ జరిగిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి రంగంలోకి దిగారు మంత్రి నారా లోకేష్.. అనంతపురంలో సూపర్ సిక్స్ - సూపర్ హిట్ సభకు కూడా వెళ్లకుండా.. నేపాల్ నుంచి ఏపీవారిని సురక్షితంగా రాష్ట్రానికి రప్పించడానికి అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తున్నారు మంత్రి నారా లోకేష్.
అసెంబ్లీకి రాకుండా 'రప్పా.. రప్పా..' అంటూ బయట రంకెలేస్తున్నారు.. మీ బెదిరింపులకు ఎవరూ భయపడరు.. ఇక్కడున్నది సీబీఎన్, పవన్ కల్యాణ్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్కు వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు..
సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ వేదికగా ఎమ్మెల్యేలకు మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న నేను కామన్ మ్యాన్ గా ఉన్నాను.. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా అలాగే ఉండాలని స్పష్టం చేశారు.. మనం ప్రజలకు సేవకులం.. పాలకులం కాదన్న ఆయన.. దర్జాలు, ఆర్భాటాలకు దూరంగా ఉండాలని సూచించారు..
ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీ మోతలు ఉండవని హామీ ఇస్తున్నాం అన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్ - సూపర్ హిట్ సభలో ఆయన మాట్లాడుతూ.. శివతాండవాన్ని వినిపించిన నేల ఇది.. ఎందరో కవులు, కళాకారులు పుట్టిన నేల ఇది.. సీమకు ఎప్పుడూ కరువు కాలం, ఎండా కాలమే.. దీన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు..
సూపర్ సిక్స్-సూపర్ హిట్ విజయోత్సవ సభ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.. దసరా రోజున ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర అందిస్తాం అన్నారు.. ఆటో ఉన్న ప్రతి వ్యక్తికి 15 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తాం అంటూ శుభవార్త చెప్పారు..
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఐక్యత ఇలాగే వర్ధిల్లుతుందన్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్.. అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ - సూపర్ హిట్ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సామాజిక, ఆర్దిక సమానత్వం సాధించడానికి పెట్టిన పథకాలివి.. కేవలం సూపర్ సిక్స్ లే కాదు, చాలా సిక్స్ లు ఇప్పటికే కూటమి ప్రభుత్వం కొట్టిందన్నారు..