వాయువ్య బంగాళాఖాతంలో ఒడిషా-పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకు అల్పపీడనం ఏర్పడింది. క్రమేపీ బలపడి తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందుతుందని ఐఎండీ ప్రకటించింది. అల్పపీడన ప్రాంతం నుంచి రుతుపవన ద్రోణి ఒకటి సంబల్పూర్ మీదుగా వ్యాపించింది.
వినాయక చవితి రోజు బాపట్ల జిల్లాలో విషాద ఘటన జరిగింది.. తామర పూల కోసం వెళ్లి చెరువులో పడి ఇద్దరు బాలురు ప్రాణాలు విడిచారు.. ఈ ఘటనలో బాపట్ల జిల్లాలోని పూండ్ల గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు మృతిచెందారు.. వినాయక చవితి పర్వదినం సందర్భంగా.. తామర పూల కోసం చెరువులోకి దిగారు ఇద్దరు బాలురు.. మృతులు పూండ్ల గ్రామానికి చెందిన 17 ఏళ్ల సైకం నాగభూషణం, 15 ఏళ్ల సుద్దపల్లి శ్రీమంత్ గా గుర్తించారు.
నాగర్సోల్ నుంచి నరసాపురం వెళుతున్న నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు తెల్ల వారుజామున 2.47 గంటలకు నడికుడి రైల్వేస్టేషన్ సమీపానికి చేరుకుంది. ఆ సమయంలో మాచర్ల హైవే అండర్ బ్రిడ్జి సమీపంలో దుండగులు పట్టాల పక్కన హోమ్ సిగ్నలింగ్ను ట్యాంపర్ చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. నేడు విశాఖపట్నం వెళ్లనున్నారు.. గత ఎన్నికల్లో కూటమి విజయంలో కీలక భూమిక పోషించింది జనసేన.. ఆ తర్వాత కీలకమైన డిప్యూటీ సీఎం పదవి కూడా జనసేనాని వరించింది.. ఓ వైపు కూటమి సర్కార్లో కీలక శాఖలు నిర్వహిస్తూనే.. మరోవైపు పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు పవన్ కల్యాణ్.. దీనికోసం విశాఖ వేదికగా మూడు రోజుల పాటు జనసేన విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించబోతున్నారు..
* నేడు వినాయక చవితి.. దేశవ్యాప్తంగా గ్రామాలు, వీధులు, పట్టణాలు, ఇళ్లలో కొలువుదీరనున్న గణనాథులు.. * భారత్పై సుంకాలు 50 శాతానికి పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నేటి నుంచే అమల్లోకి రానున్న 50 శాతం సుంకాలు.. * ఢిల్లీ: ఇవాళ సీపీఐ, సీపీఎం అగ్రనేతలను కలవనున్న ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి.. మధ్యాహ్నం 2 గంటలకు సీపీఐ జాతీయ పార్టీ కార్యాలయానికి, 3 గంటలకు సీపీఎం కార్యాలయాలనికి వెళ్లనున్న సుదర్శన్ రెడ్డి..…