ఉమ్మడి కృష్ణాజిల్లాలో భారీ వర్షాల ఎఫెక్ట్ స్పష్టంగా కనపడుతోంది. జగ్గయ్యపేటలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలలో వరి, పత్తి, పొలాలు నీట మునిగాయి. కూచి వాగు వరద ప్రవాహం ఎక్కువ ఉండటంతో పెనుగంచిప్రోలు నుండి తెలంగాణ మధిరకు రాకపోకలు నిలిచాయి.
ఎన్టీఆర్ జిల్లాలో కట్టలేరు వాగుకు మరోసారి పోటెత్తింది వరద ప్రవాహం.. గంపలగూడెం మండలం వినగడప - తోటమూల గ్రామాల మధ్య ఉన్న కట్టలేరు వాగుకు పోటెత్తిన వరదతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. గత రెండు వారాల క్రితం వచ్చిన భారీ వరదలకు గండ్లు పడ్డాయి.. మీటర్ల మేర కోతకు గురైంది తాత్కాలిక రహదారి.. ఇటీవలే రోడ్లు మరమ్మత్తుల అనంతరం రాకపోకలు పునః ప్రారంభమయ్యాయి.. కానీ, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రవాహంతో నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు…
విశాఖ పోలీస్ కమిషనరేట్ కు సమీపంలో కురుస్తున్న వర్షాలకు బాగా తడిసిన ఆరడుగుల ఎత్తు 30 మీటర్ల పొడవున్న ఓ గోడ కూలిపోయింది.. వినాయక మండపంతో పాటు సమీపంలోనే ఉన్న చిన్న చిన్న షాప్స్, బైక్ ల మీద పడడంతో ధ్వంసం అయ్యాయి.
జిల్లాల పునర్విభజన తర్వాత భీమవరం కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లా ఏర్పాటైంది. పాలనకు అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులో లేకపోవడంతో భీమవరం సమీపంలోని ప్రైవేటు కార్యాలయంలో కలెక్టరేట్ కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు.. ప్రస్తుతం ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న కలెక్టరేట్ కోసం 20 ఎకరాల భూమి, 100 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎడతెగని రీతిలో భారీ వర్షం పడుతోంది. పలు చోట్ల పంట పొలాల్లో నీరు నిలిచింది. విజయవాడలో ఉదయం నుంచి కంటిన్యూస్గా వర్షం కురుస్తుండడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
మూడు రోజుల జనసేన పండుగకు విశాఖ నగరం సిద్ధమైంది. ప్రభుత్వంలో భాగస్వామ్యం తర్వాత పార్టీలో పరిస్థితులను సమీక్షించుకునేందుకు జరుగుతున్న సమావేశాలు కావడంతో శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్. ఇవాళ, రేపు పార్టీ అంతర్గత అంశాలపై చర్చ జరుగుతుంది.
* నేటి నుంచి విదేశీ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ * తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 11 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక.. భద్రాద్రి, భూపాలపల్లి, ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్, నిర్మల్, కొమురంభీం, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు.. తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. 25 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన * తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. నేడు ఏరియల్…
అనకాపల్లి జిల్లా పరవాడలోని వెన్నెలపాలెం గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వివాదం మొదలైంది.. పరవాడ మండలం, మాజీ మంత్రి మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి స్వగ్రామం.. అయితే వెన్నెలపాలెం గ్రామంలో వినాయక చవితి వేడుకల్లో రెండు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్.. తిరుపతికి వచ్చారు.. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థి...