వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి కన్నుమూశారు. ఈ రోజు మధ్యాహ్నం పొలంలో పనులు చేస్తుండగా.. కళ్లు తిరిగి కింద పడిపోయిన భాస్కర్ రెడ్డిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.. అయితే, వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. అప్పటికే భాస్కర్ రెడ్డి మృతిచెందినట్టుగా నిర్ధారించారు.
ప్రేమిస్తున్నాడంటూ మైనర్ బాలిక వెంట పట్టాడు.. ప్రేమ పేరుతో నమ్మించాడు.. కొన్ని రోజుల తర్వాత తన నైజాన్ని బయటపెట్టాడు.. బాలికను ఇంటికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. అంతే కాదు.. మరో యువకుడిని రప్పించి.. ఆ బాలికపై అఘాయిత్యం చేయించాడు..
అమరావతిపై వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని పెడితే ఖర్చు తక్కువ అవుతుందన్నారు.. అయితే, ఇంతకు ముందు అమరావతిని రాజధానిగా తీసేస్తామని మేం అనలేదన్నారు.. అమరావతిని కలుపుకొని ఢీసెంట్రలైజ్ అన్నాం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం అన్నాం.. మూడు రాజధానులు అని తప్పుడు ప్రచారం చేశారన్నారు..
హైటెక్ సిటీ రాక ముందు హైదరాబాద్ ఎకరం రూ.లక్ష ఉండేది.. ఇప్పుడు రూ.100 కోట్లకు చేరిందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అమరావతి అభివృద్ధి నిరంతర ప్రక్రియ.. హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి జరుగుతూ ఉంటుందన్నారు..
ఎరువులు ఎటువంటి కొరత లేకుండా అందుబాటులో ఉన్నాయని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. విజయవాడలోని క్యాంప్ ఆఫీస్ లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం యూరియా, డీఏపీ, పొటాష్, కాంప్లెక్స్ ఎరువులు సహా అన్నిరకాల ఎరువులు సరిపడా నిల్వలుగా ఉన్నాయని తెలిపారు.
ఏపీకి చెందిన మరో 44మంది టూరిస్టులు అక్కడ చిక్కుకున్న వార్తలు కలవరపెడుతున్నాయి.. నంద్యాల నుండి ముక్తినాథ్ యాత్రకు వెళ్లి , నేపాల్ లో చిక్కుకున్నారు 44 మంది యాత్రికుల బృందం.. దీంతో, మంత్రి ఫారూఖ్ ను ఆశ్రయింయారు యాత్రికుల కుటుంబ సభ్యులు.. వెంటనే హోంమంత్రి అనిత , జిల్లా కలెక్టర్ రాజకుమారితో మాట్లాడిన మంత్రి ఫరూక్.. ఆ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెప్పారు..
పవన్ కల్యాణ్‌పై ఫైర్ అయ్యారు వైసీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర.. రాజ్యాంగం గురించి మాట్లాడే పవన్ కల్యాణ్‌కు అసలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న దారుణాలు కనడుతున్నాయా? అని ప్రశ్నించారు..
విజయవాడలో కోర్టు వద్ద మరోసారి హల్చల్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ఏపీ మద్యం స్కాం కేసులో అరెస్ట్ అయిన ఆయన.. అప్పటి నుంచి కోర్టుకు తీసుకొచ్చిన ప్రతీసారి.. ఏదో హల్ చల్ చేస్తూ వస్తున్నారు.. అయితే, తాను ఏ తప్పు చేయకపోయినా కేసు నమోదు చేసి జైల్లో పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. మీడియాలో కూడా ఇష్ట రీతిన అసత్య వార్తలు రాస్తున్నారని.. వారిపై న్యాయపోరాటం…
AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలపై కసరత్తు వేగవంతమైంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలోపే ప్రభుత్వానికి నివేదికని ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోంది. ఆ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకొనుంది. అయితే పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. రెండు మూడు జిల్లాల ఏర్పాటుతో పాటు కొన్ని చోట్ల హద్దులు మార్చే అవకాశం ఉందని సమాచారం. వైస్సార్సీపీ హాయాంలో పరిపాలన సౌలభ్యం కోసం 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు. అయితే, ఇందులోని గందరగోళం ఉందని మార్పులు అవసరమని…