తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి కావాలని.. పోలీస్ భద్రత కల్పించాలంటూ జిల్లా ఎస్పీ జగదీష్ ను కోరిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తాను తాడిపత్రి వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని.. ఆ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం భద్రత కల్పించాలని కోరినట్లు సమాచారం.
అమరావతి చాలా సేఫ్ సిటీ... ఇందులో అనుమానం లేదన్నారు మంత్రి పొంగూరు నారాయణ.. ఇవాళ ఉదయం రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయన.. అమరావతి - నేలపాడులోని గెజిటెడ్ అధికారుల భవనాలు పరిశీలించారు.. క్లాస్- 4 ఉద్యోగుల క్వార్టర్లు నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ.. అమరావతి నిర్మాణంలో ప్రస్తుతం 13 వేల మంది పని చేస్తున్నారని తెలిపారు.. అధికారుల కోసం ఆరు టవర్ల నిర్మాణం జరుగుతోంది..…
సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. వైఎస్ జగన్, ఆయన ఎమ్మెల్యేలు సభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు.. అంతేకాదు, సభాపతిగా ఎమ్మెల్యేలందరికీ సమాన అవకాశం కల్పిస్తానని పేర్కొన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.
వంగవీటి రాధాకృష్ణ అలియాస్ వంగవీటి రాధా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌తో సమావేశం కాబోతున్నారు.. 11 నెలల తర్వాత నారా లోకేష్, వంగవీటి రాధా భేటీ జరుగుతోన్న నేపథ్యంలో.. విషయం ఏమై ఉంటుంది? అనే చర్చ ఆసక్తికరంగా మారింది.
టీడీపీ నాయకుల వేధింపులతో ఇప్పుడు ఊర్లు వదిలిపెట్టి వెళ్లినవారు.. మళ్లీ తిరిగి వస్తారని తెలిపారు కాసు.. మీరు గ్రామం దాటించారని.. రేపు రాష్ట్రం దాటి వెళ్లే పరిస్థితి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు.. తెగించే వరకూ తీసుకెళ్తున్నారని వ్యాఖ్యానించిన ఆయన.. వైసీపీ నాయకులు తెగిస్తే టీడీపీ తట్టుకోలేరని హెచ్చరించారు.
వైఎస్ జగన్ అసెంబ్లీ హాజరుపై సీఎం చంద్రబాబు విసిరిన సవాల్ ఏడ్చినట్లుగా ఉంది అంటూ కౌంటర్ ఇచ్చారు వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. చంద్రబాబుకి దమ్ము, ధైర్యం ఉంటే జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు.. అసలు, ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు..? అని ప్రశ్నించారు..