ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేసేందుకే చంద్రబాబు అధికారంలోకి వచ్చినట్లున్నారని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ.. గుంటూరు ఏసీ కాలేజీలో ఏఐఎస్ఎఫ్ నిర్వహించి సమావేశంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి అన్ని రంగాలు ప్రైవేటీకరణ అవుతున్నాయన్నారు.
గుంటూరు జిల్లా తురకపాలెంలో ఏదో జరుగుతోంది.. ప్రభుత్వం నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ హర్షకుమార్.. తురకపాలెం మెడికల్ క్యాంప్‌కు వచ్చిన హర్షకుమార్.. బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలు అడిగి తెలుసుకున్న హర్షకుమార్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తురకపాలెం మరణాలకు కారణాలు డాక్టర్లు చెప్పలేక పోతున్నారు.. ఐసీఎంఆర్ టీంలు వచ్చినా కారణాలు తేలలేదు. దళితులు ఉన్న ప్రాంతాలలోనే మరణాలు సంభవించాయి అని ఆరోపించారు...
బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు తెలిపారు సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్.. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు.
ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారి ఉచ్చులో పడవద్దు అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏపీలో జరుగుతోన్న తాజా పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. రాష్ట్రంలో అభివృద్ధి దిశగా... సంక్షేమ ఫలాలు అందిస్తూ సుపరిపాలన సాగిస్తున్న ఈ తరుణంలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా కుట్రలు మొదలయ్యాయి.
పెద్ద ఎత్తున ఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.. 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది ప్రభుత్వం.. 7 జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులు రాగా.. మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు.. ఇక, 12 జిల్లాల్లో ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగించింది ప్రభుత్వం..